ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేయడంలో ముందుండే ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ప్రధాన కార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు తాజాగా ఆయన కలవరపాటుకు గురయ్యే కామెంట్లు చేశారు. ఏపీ సీఎం తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం నిర్వహిస్తుంటే అదే సమయంలో ఆయన ఉలిక్కిపడేలా ఐ వై ఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్ లో స్పందించిన కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు ఖాయమని స్పష్టం చేశారు.
అపద్ధర్మ సర్కారుకు సారథ్యం వహిస్తున్న టీ ఆర్ ఎస్ పార్టీయే మళ్లీ పగ్గాలు చేపట్టనుందని ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. ``మా ఇంట్లో పనివాడు, మా డ్రైవరు ఓటేయడానికి ఊరికి వెళ్తామన్నారు. వాళ్లే స్వచ్చందంగా *ఈసారి టిఆర్ఎస్ ను గెలిపించుకోవాలి, ఊరికి వెళ్లి ఓటేయాలని* అన్నారని ఐ వై ఆర్ చెప్పారు. సర్వేలను పక్కన పెడితే రానున్న ఎన్నికలలో ఫలితాలు ఎట్లా ఉంటాయనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అవసరం లేదేమో`` అని ఐ వై ఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు.