ఎప్పుడేం చేయాలన్న క్లారిటీ ఉన్న నేతలు చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఇమేజ్ బిల్డింగ్ కోసం పెద్ద పెద్ద సంస్థల సలహాలు తీసుకునే కన్నా..కాస్త మెదడు పెట్టి ఆలోచిస్తే ప్రజల మనసుల్ని ఎంతలా దోచుకోవచ్చన్న విషయాన్ని టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో?
సమకాలీన రాజకీయాల్లో సోషల్ మీడియాతో ఇమేజ్ బిల్డింగ్ విషయంలో కేటీఆర్ తో పోటీ పడే నేతలు తెలుగు రాష్ట్రాల్లో కనిపించరనే చెప్పాలి. కేటీఆర్ ట్విట్టర్ పేజీ చూస్తే..ఆయన్ను ఆయన ప్రొజెక్టు చేసుకునే తీరు ఒక క్రమపద్దతిలో ఉంటుంది. దాదాపు రెండు వందలకు పైగా పోస్టుల్ని చూసుకుంటూ వెళ్లండి.. ఎక్కడా కేటీఆర్ సాదాసీదా ప్రజలతో మమేకం అయినట్లుగా కనిపించరు. ఆయన చాలా సింఫుల్ అన్నట్లుగా కూడా ఉండరు. కాకుంటే.. చిన్న విషయాలకు సైతం సానుకూలంగా స్పందిస్తారన్న భావన కలిగేలా కొన్ని పోస్టులు ఉంటాయి. తన స్థాయిని పట్టించుకోనట్లుగా వ్యవహరించే తీరు కూడా కనిపిస్తుంది.
తాజాగా ఆయన పోస్ట్ చేసిన పోస్ట్ మాత్రం అందుకు కాస్త భిన్నం. కారులో వెళుతున్న ఆయన.. ఉన్నట్లుండి రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న ఛాయ్ దుకాణం ముందు తన కాన్వాయ్ ను ఆపిన కేటీఆర్.. సదరు చాయ్ దుకాణం ఓనర్ కు షాకిచ్చినంత పని చేశారు. ప్రభుత్వాధినేత కుమారుడు.. తెలంగాణ రాజకీయాల్లో కీలకభూమిక పోషించే కేటీఆర్ లాంటి యంగ్ నేత తన చిన్న షాపునకు రావటంతో సదరు హోటల్ నిర్వాహకుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
తన వాళ్లతో కలిసి.. షాపులోని టీ తాగిన కేటీఆర్.. చాయ్ బాగుందన్న మాటను చెప్పటమే కాదు.. సదరు యజమానితో కలిసి ఫోటోలు దిగి సంతోషానికి గురి చేశారు. అంతేకాదు.. అలిసిన సమయంలో చాయ్ తాగితే.. అంతకంటే కావాల్సిందేముంటుందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఎక్కడ తాను చాయ్ తాగాను? సదరు చాయ్ తాగిన హోటల్ పేరును.. యజమాని పేరును ప్రస్తావించని కేటీఆర్.. తానెంత సింఫుల్ అన్న విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేయటం కనిపిస్తుంది. ఇటీవల నడ్డాను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఆయన తీరును అందరూ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేలా ఉన్న ఫోటోల్ని పోస్ట్ చేయటం వెనకున్న మర్మం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.