ఎంకి పెళ్లి సుబ్బి చావు కు వచ్చిందంటే ఇదే.. ప్రపంచంలోనే అతిపెద్ద క్లౌండ్ కంప్యూటింగ్ కంపెనీ అయిన ‘అమేజాన్ వెబ్ సర్వీస్’ అమెరికా సైన్యానికి సమకూర్చే దాదాపు 1000 కోట్ల డాలర్ల విలువైన ‘క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థ’ కాంట్రాక్టును దక్కించుకోలేకపోయింది. అమెరికా అధ్యక్షుడు డొలాడ్డ్ ట్రంప్ తో అమెజాన్ అధిపతి జెఫ్ బోజెస్ కు ఉన్న విభేదాల కారణంగానే ఈ భారీ విలువైన కాంట్రాక్టును అమెజాన్ కోల్పోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
అమెరికా రక్షణ శాఖను మరింత బలోపేతం చేసేందుకు 34 లక్షల మంది యూజర్లు నిర్వహించే క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థ ‘జాయింట్ ఎంటర్ ప్రైజ్ డిఫెన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (జేడీ)’ ప్రాజెక్టుకు పెంటగాన్ రక్షణ విభాగం టెండర్ పిలిచింది. 1000 కోట్ల డాలర్ల విలువ గల ఈ ప్రాజెక్టు ను దక్కించుకునేందుకు ప్రపంచం లోనే అతిపెద్ద క్లౌడ్ కంపెనీ అయిన అమెజాన్ తోపాటు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, ఐబీఎం వంటి వారు పోటీపడ్డారు.
ఈ నాలుగు సంస్థల్లో అమెజాన్ కంపెనీయే అత్యంత సామర్థ్యం గల పెద్ద కంపెనీ. అమెజాన్ వెబ్ సర్వీస్ 2019లో ఏకంగా 2500 కోట్ల డాలర్ల క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారంచేసింది. దీంతో అమెరికా రక్షణ శాఖ జేడీ కాంట్రాక్టు దానికే అనుకున్నారంతా..
కానీ ఇక్కడే అధ్యక్షుడు ట్రంప్ రంగ ప్రవేశం చేశారు. అమెజాన్ కు దక్కాల్సిన కాంట్రాక్టును మైక్రోసాఫ్ట్ కు దక్కేలా చేశారు. ఇక మిగతా అమెరికా వ్యవస్థలు కూడా ఆధునిక బాట పట్టడంతో ఆ కాంట్రాక్టులు కూడా అమెజాన్ కు దక్కకుండా మైక్రోసాఫ్ట్ కు దక్కేలా ట్రంప్ వ్యవహరిస్తున్నారని తెలిసింది. దీంతో తమకు దక్కుతుందనుకున్న కాంట్రాక్టు మైక్రోసాఫ్ట్ కు పోవడంపై అమెజాన్ షాక్ తిన్నది. ట్రంప్ ఒత్తిడి వల్లే కాంట్రాక్టు పోయిందని కోర్టు ను ఆశ్రయించింది. నిబంధనల ప్రకారం తమకే రావాలని కోర్టు లో పిటీషన్ వేసింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా ట్రంప్ కు వ్యతిరేకంగా వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కథనాలు రాసింది. ఈ పత్రిక అధిపతి కూడా అమెజాన్ అధినేత జెఫ్ బోజెసే. పాత పగలు దృష్టిలో పెట్టుకొనే ట్రంప్ వ్యూహాత్మకంగా ఈ భారీ కాంట్రాక్టును అమెజాన్ కు దక్కకుండా చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పుడు తనను కొట్టిన దెబ్బకు ఇప్పుడు ట్రంప్ ప్రతీకారం తీర్చుకున్నాడని అంటున్నారు.