అబ్బో.. జుట్టుపై ట్రంప్ ప్రేమ మామూలుగా లేదుగా?

Update: 2020-09-04 17:32 GMT
కరోనా టైంలో మనుషుల ప్రాణాలకే భద్రత లేకుండా పోయిన ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన జుట్టుపై తెగ ప్రేమను వ్యక్తం చేశాడు. 70 ఏళ్ల వయసులోనూ నిగనిగలాడే జుట్టు ట్రంప్ సొంతం. తాజాగా ఆయన హెయిర్ స్టైల్ రహస్యం తెలిసిపోయింది. తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇబ్బందుల్లోకి నెట్టాయి.

2018లో పారిస్ సమీపంలోని ఐస్నే మార్క్ లో అమెరికన్ సైనికులను ఖననం చేసిన స్మశాన వాటికను సందర్శించడానికి ట్రంప్ నిరాకరించారు. దీనివెనుక కారణంపై తాజాగా ఓ పత్రిక బయటపెట్టింది. ‘వర్షంలో తడిస్తే తన జుట్టు చెడిపోతుందని.. అందుకే భయపడ్డానని’ చెప్పాడట..

ఇక ఓడిపోయిన అమెరికన్ సైనికులను ఖననం చేసిన చోటుకు నేను ఎందుకు వెళ్లాలి.. వారు అంతా ఓడిపోయిన వారే కదా అని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు ఓ పత్రిక బయటపెట్టింది.

అయితే ఈ ఆరోపణలను ట్రంప్ టీం ఖండించింది. ట్రంప్ ఆ సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ప్రచార కమిటీ కార్యదర్శి తెలిపారు.
Tags:    

Similar News