10 మినిట్స్‌లో ట్రంప్ డెసిష‌న్ తీసుకోకుంటే?

Update: 2017-05-17 18:49 GMT
ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో మూడో ప్ర‌పంచ యుద్ధం మీద భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మూర్ఖ‌త్వానికి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ దూకుడు.. మొండిత‌నానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కార‌ణంగా రెండు దేశాల మ‌ధ్య యుద్ధ మేఘాలు క‌మ్ముకోవ‌ట‌మే కాదు.. మూడో ప్ర‌పంచ యుద్ధం ఏ క్ష‌ణంలో అయినా మీద ప‌డుతుంద‌న్న‌ట్లుగా ప‌రిస్థితి మారింది.

ఇప్ప‌టివ‌ర‌కూ అమెరికాను ట‌చ్ చేసే బాలిస్టిక్ మిస్సైల్‌ను ఉత్త‌ర కొరియా త‌యారు చేయ‌కున్నా.. ఏదోఒక రోజు  త‌‌యారు చేసి.. ప్ర‌యోగిస్తే ప‌రిణామాలు ఎలా ఉంటాయ‌న్న అంశం మీద అమెరికాకు చెందిన ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త‌లు రియాక్ట్ అవుతున్నారు. ప్ర‌ఖ్యాత సైంటిస్టులు డేవిడ్ రైట్‌.. మార్క‌స్ చిల్ల‌ర్ లు ఆస‌క్తిక‌ర అంశాన్ని తెర మీద‌కు తెచ్చారు.
ఉత్త‌ర‌కొరియా.. అమెరికా మ‌ధ్య దూరం 5500 మైళ్ల దూర‌మ‌ని.. అణుక్షిప‌ణిని కానీ ప్ర‌యోగిస్తే.. అది అగ్ర‌రాజ్యాన్ని చేరుకోవ‌టానికి 30 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అమెరికా అధికారులు ఉత్త‌ర‌కొరియా క్షిప‌ణిని గుర్తించి.. క‌న్ఫ‌ర్మ్ చేసుకున్న త‌ర్వాత అధ్య‌క్షుడికి తెలియ‌జేయ‌టానికి ప‌ట్టే స‌మ‌యం ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు.

అలాంటి వేళ ఏం చేయాల‌న్న నిర్ణ‌యాన్ని అధ్య‌క్షుల వారు తీసుకోవ‌టానికి కేవ‌లం 10 నిమిషాలు మాత్ర‌మే స‌మ‌యం ఉంటుంద‌ని చెబుతున్నారు. ఆ విష‌యంలో ఏ మాత్రం ఆల‌స్యం జ‌రిగినా భ‌యాన‌క ప‌రిస్థితులు చోటు చేసుకుంటాయ‌ని చెబుతున్నారు.  అమెరికా రాజ‌ధాని వాషింగ్ట‌న్ డీసీని చేరుకోవ‌టానికి 30 నుంచి 39 నిమిషాలు మాత్ర‌మే ప‌ట్టే వీలుంద‌ని.. అలాంట‌ప్పుడు నిర్ణ‌యం చాలా వేగంగా తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు. ఇలాంటి మాట‌లు వింటుంటే.. వెన్నులో చ‌లి మొద‌లు కావ‌టం లేదు?
Tags:    

Similar News