కరోనా మహమ్మారి జోరు దేశంలో కొనసాగుతుంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక దేశంలో వ్యాక్సినేషన్ కోసం కేంద్రం సన్నాహాలు మొదలుపెట్టింది. దేశంలో ఫిబ్రవరిలో వ్యాక్సిన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా టీకా పంపిణీకి కార్యాచరణను రూపొందిస్తోంది. వ్యాక్సిన్ తెలంగాణకు చేరిన రెండు రోజుల్లోగానే పంపిణీని ప్రారంభించాలని వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మూడు కోట్ల డోసుల వ్యాక్సిన్ ను నిల్వచేసేందుకు సరిపడా ప్రత్యేక కోల్డ్ చైన్ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు. మరోవైపు రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ ను ఎవరికి ఇవ్వాలనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి నర్సుకు తొలి వ్యాక్సిన్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని వైద్య శాఖ అధికారులు నిర్ణయించారు.
అయితే, దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని వైద్య సిబ్బందికి తొలి విడతలోనే వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు 16 సంవత్సరాల్లోపు వారికి టీకా వేయబోమని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఆ వయసు వారిపై వ్యాక్సిన్ ను పరీక్షించకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు.