స్టాట్చూ ఆఫ్ ఈక్వాలిటి రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వచ్చిన నరేంద్రమోడిపై తెలంగాణా సమాజం ఫుల్లుగా ఫైర్ అయిపోయింది. స్టాట్చూ ఆఫ్ ఈక్వాలిటి విగ్రహాన్ని ఆవిష్కరించటం తెలిసిన మోడికి పరిపాలనలో అన్నీ రాష్ట్రాలను ఒకటిగా చూడాలని తెలీదా ? అంటు మండిపోయారు. ఈమధ్యనే ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణాకు అన్యాయం జరిగిందంటు కేసీయార్ మండిపడిన విషయం తెలిసిందే.
తెలంగాణాకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని కేసీయార్ ఉదాహరణలతో సహా చెప్పి మోడి, ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ను ఫుల్లుగా వాయించేసిన విషయం తెలిసిందే. నెటిజన్లు ఇపుడిదే అంశాన్ని ప్రస్తావించి మోడిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. ఈక్వాలిటి ఆఫ్ తెలంగాణా అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో మొదటి స్ధానంలో జాతీయస్ధాయిలో ట్రెండింగ్ లో ఉంది. నెటిజన్లు, టీఆర్ఎస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు తెలంగాణాకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు.
గడచిన ఏడేళ్ళుగా తెలంగాణాకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఉదాహరణలతో సహా నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ఎంగట్టేస్తున్నారు. కేంద్రప్రభుత్వం నిధుల వాటాలో తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం, తెలంగాణా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు అందని కేంద్రసాయం, అపరిష్కృతంగా ఉన్న పునర్విభజన చట్టం, పాలమూరు-రంగారెడ్డి పథకానికి జాతీయహోదా ఇవ్వకపోవటం లాంటి అనేక అంశాలను ట్విట్టర్లో ప్రస్తావిస్తున్నారు.
వివిధ పథకాల అమలుకు సాయం కోరుతు కేంద్రానికి మంత్రులు లేఖలు రాసినా సమాధానం ఎందుకు ఇవ్వటంలేదంటు మంత్రులు కూడా కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్రంలోని వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై కేంద్రం చూపిస్తున్న వివక్షను మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎత్తిచూపారు. మొత్తానికి మొన్న పంజాబ్ కు వెళ్ళినపుడు మోడికి ఒకరకమైన అవమానం జరిగితే ఇపుడు తెలంగాణాకు వచ్చినపుడు మరోరకమైన అవమానం జరిగింది.
బీజేపీ పాలిత రాష్ట్రాల విషయంలో ఒకలాగ, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల విషయంలో మరోలాగ మోడి వ్యవహరిస్తున్నారంటు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఏపి ప్రయోజనాల విషయంలో కూడా మోడి సీతకన్నే వేస్తున్న విషయం తెలిసిందే. పోలవరం, ప్రత్యేకహోదా, ప్రత్యేకరైల్వేజోన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రజల మనోభావాలను మోడి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. అదే ఇపుడు ట్విట్టర్ వేదికగా బయటపడింది.