ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతికి సొంత ఊరు వెళ్లడానికి హైదరాబాద్ నుంచి ఆ రాష్ట్ర వాసులంతా కదులుతున్నారు. సంక్రాంతికి సెలవులు రావడంతో ఇప్పుడు చాలా మంది ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు బుక్ చేసుకొని సొంత ఊరు పయనమవుతున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రా బస్సుల కంటే తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లోనే టికెట్ రేట్లు చీప్ ఉన్నాయని వీటిల్లో పోవడానికే మొగ్గు చూపుతున్నారట.. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లోనే బుకింగ్ లు ఎక్కువగా జరుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది.
సంక్రాంతి పండుగకు ఊరు వెళ్లాలంటే ఆంధ్రా బస్సుల కంటే తెలంగాణ బస్సులే చౌకగా ఉన్నాయని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. అయితే ఏపీ బస్సుల కంటే తెలంగాణ ఆర్టీసీ బస్సుల రేట్లు తక్కువగా ఉండడానికి కారణముంది. ఏపీ నుంచి ఖాళీగా బస్సులు వచ్చి హైదరాబాద్ నుంచి తమ రాష్ట్ర వాసులను తీసుకెళ్లాలి. సో వచ్చే టప్పుడు ఖాళీ కావడంతో ఆ నష్టాన్ని భరించేందుకు కాస్త టికెట్ రేట్లు పెంచామని ఏపీ అధికారులు చెబుతున్నారు.. అయితే తెలంగాణ బస్సులు మాత్రం ఇక్కడి నుంచే ఫుల్లుగా ప్రయాణికులతో వెళుతుండడం.. ఏపీ నుంచి జనాలతో తిరిగి వస్తుండడంతో వాటికి ఆ నష్టం తక్కువ అని.. అందుకే సంక్రాంతి పండక్కి కొత్తగా రేట్లు పెంచలేదని తెలంగాణ ఆర్టీసీ అధికారులు వివరిస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీ బస్సులకు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ప్రయాణికులు వెళ్లడానికి అవకాశం ఉండడంతో ఈ బస్సులు చవకగా ఉన్నాయి. అదే ఏపీ నుంచి ఖాళీగా వచ్చే ఆంధ్రా బస్సులకు ఒక ట్రిప్ అదనపు భారంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
అయితే పండక్కి ఊరు వెళ్లే ప్రయాణికులు టికెట్ ధరలు చూసి తెలంగాణ బస్సుల్లోనే తక్కువగా ఉందని చెబుతున్నారు. అందుకే చాలా మంది టీఎస్ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నామని అంటున్నారు.
అయితే ఆంధ్రా, తెలంగాణ బస్సుల మధ్య తేడా కేవలం 30శాతమేనని.. అయితే ప్రయాణికులు మాత్రం తక్కువ రేటున్న తెలంగాణ బస్సుల్లోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నామని అంటున్నారు.