ప్రజాభిమానం నిండుగా ఉండి.. ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ మెజార్టీని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కట్టబెట్టటం ద్వారా ఆంధ్రోళ్లు యువనేత మీద తమకున్న అభిమానాన్ని.. నమ్మకాన్ని ప్రదర్శించారు. ప్రజారంజక నిర్ణయాలతో అంతకంతకూ వేగంగా దూసుకెళ్లటం ఆయన రాజకీయ ప్రత్యర్థులకు ఇప్పుడు మింగుడుపడని రీతిలో మారింది. ఆయన్ను దెబ్బ కొట్టేందుకు ఎలాంటి అవకాశాలు లేకపోవటంతో కొత్త తరహా కుట్రలకు తెర తీస్తున్నారు.
జగన్ ను రాజకీయంగా దెబ్బ తీయటం మినహా మరేమీ అక్కర్లేదన్నట్లుగా ఉన్న కొందరు దారుణమైన రీతిలో ప్రచారాలకు తెర తీస్తున్నారు. విన్నంతనే నమ్మేలా తయారు చేసిన ఇన్ స్టెంట్ అబద్ధాలతో భావోద్వేగాల్ని టచ్ చేసేలా చేసి.. జగన్ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేయాలన్న తాజా కుట్ర ఇప్పుడు బద్ధలైంది.
టీడీడీ డిప్యూటీ ఎగ్జిక్యుటివ్ అధికారిగా యువనేత బంధువు క్రిస్టోఫర్ ను ఎంపిక చేసినట్లుగా సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారానికి తెర తీశారు. అన్య మతస్తుడ్ని ప్రముఖ హిందూ ధార్మిక సంస్థలో కీలక పదవిలో ఎలా కూర్చోబెడతారన్న సందేహం మదిలో కలిగేలా ఎమోషనల్ అసత్యాన్ని తమకు బాగా పట్టున్న గ్లోబల్ తరహాలో వైరల్ చేయటం షురూ చేశారు.
ఈ కుట్రను గుర్తించిన టీటీడీపీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. జరుగుతున్న కుట్రను ట్వీట్ రూపంలో వెల్లడించారు. క్రిస్టోఫర్ ను టీటీడీ డీఈవోగా నియమించారన్నది పూర్తిగా అబద్ధమని.. అలాంటిదేమీ జరగలేదన్నారు. టీటీడీ బోర్డు డీఈవోగా క్రిస్టోఫర్ ను నియమిస్తున్నట్లుగా సాగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని.. అది అవాస్తవమని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి వాటిని ప్రచురించే ముందు మీడియా కానీ సోషల్ మీడియా కానీ సరిగా చెక్ చేసుకోవాలని కోరారు. వాస్తవమని నిర్దారణ అయ్యాకే పబ్లిష్ చేయాలే తప్పించి.. అసత్యాల్ని ప్రచారం చేయొద్దన్నారు. ఈ తరహా దుష్ప్రచారాల్ని చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. జగన్ ను రాజకీయంగా దెబ్బ తీయటానికి దేవుడి పేరును ఇంతలా వాడుకోవాలా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది.