ఇబ్బడి ముబ్బడిగా డబ్బులున్నాయి. ఎలా ఖర్చు పెడుతున్నారు? ఎందుకు ఖర్చు పెడుతున్నారు? పెడుతున్న ఖర్చులో సహేతుకత ఉందా? అని ప్రశ్నించే దిక్కు లేదు అందుకే తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. అందులో భాగమే.. ఇప్పుడు తిరుమలేశుని ఆలయంలో లోపల ఇనుప మెట్లను ఏర్పాటు చేయడం, తిరిగి వాటిని తొలగించడం జరుగుతోంది. భక్తులకు ఏమాత్రం సౌకర్యంగా ఉంటుందో చెక్ చేసుకోకుండా - ఆలయ సాంప్రదాయాలు - ఆగమ శాస్త్రానికి తగినట్లుగా ఉంటుందో లేదో గమనించకుండా.. ఎవరికి తోచిన నిర్ణయాలు వారు తీసుకుంటూ ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని పండితులు - భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలలో ఆలయంలో మెట్లు నిర్మించే విషయం - వివాదంగా ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది గానీ.. టీటీడీ పరిపాలనలో ఉన్న సకల లోపాలను ఇది ఎత్తిచూపుతోంది. టీటీడీకి ధర్మకర్తల మండలిని నియమించడంలో చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్న వైఖరి.. అక్కడ ఎడ్మినిస్ట్రేషన్ కు శాపంలా మారింది. నియంత్రణ వ్యవస్థ లేకపోవడంతో.. అధికారులు తమకు తోచింది చేసుకుపోతూ ఇష్టారాజ్యంగా చెలరేగుతున్నారు. తిరుమలేశుని ఆలయంలో వెండి వాకిలి పక్కగా ఇనుపమెట్లు నిర్మించడం గురించి పండితులు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఏకపక్షంగా పనులు చేసుకుంటూ వెళ్లిపోయారు. కానీ.. ప్రజలు భక్తులు పండితుల్లో అభ్యంతరాలు పెరిగాయి. విషయం ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లింది. దేవుడి పట్ల అపచారం చేసినట్లుగా ప్రజల సెంటిమెంటును గాయపరిస్తే.. మొదటికే మోసం వస్తుందని అనుకున్న.. సర్కారు ఆలస్యంగా మేలుకుంది. ఒక బోర్డును ఏర్పాటు చేయడం చేతకాక.. పరిపాలన గాడి తప్పేలా చేసిన వారు.. చివరికి దీనిని తొలగించాలని ఆదేశించినట్లుగా సమాచారం.
ఎన్ని లక్షల రూపాయలను ఈ మిషపై తగలేశారో తెలియదు గానీ.. అధికారులు ఆదివారం మళ్లీ హుటాహుటిన ఇనుపమెట్ల ఏర్పాటును తొలగించారు. భక్తుల సౌకర్యార్థమే ఈ మెట్లు ఏర్పాటు చేశాం అని.. వ్యతిరేకత రావడంతో తొలగిస్తున్నాం అని అధికారులు సింపుల్ గా తేల్చి చెప్పేశారు. స్వామివారికి భక్తులు ముడుపులుగా సమర్పించుకునే సొమ్మును ఇలా అతి తెలివి నిర్ణయాలతో వృథా చేసే వారి పోకడలకు జవాబుదారీతనం ఎవరిది అన్న విషయం మాత్రం తేలడం లేదు.