ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేసిన టీవీ9 దీప్తి

Update: 2019-12-29 11:30 GMT
తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీవీ9 జర్నలిస్టు దీప్తి ఆదివారం ఏపీ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఏపీ రాజధాని అమరావతి తరలింపును వ్యతిరేకిస్తూ ఉద్దండరాయుడిని పాలెంలో మౌనదీక్ష చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ న్యూస్ ను కవర్ చేయడానికి వెళ్లిన టీవీ9 జర్నలిస్ట్ నల్లమోతు దీప్తిపై నిరసనకారులు దాడి చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దీప్తి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఇక సోషల్ మీడియాలోనూ తనపై దాడి చేసిన వీడియోలు.. పాత వీడియోలు జత చేసి ట్రోల్స్ చేస్తున్నారని దీప్తి ఏపీ డీజీపీని కలిసి చర్యలు తీసుకోవాలని కోరారు. పాత వీడియోలను ఎడిట్ చేసి తన పరువుకు భంగం వాటిల్లేలా ట్రోల్స్ చేస్తున్నారని పేర్కొన్నారు.

టీవీ9 జర్నలిస్టు దీప్తి ఆందోళనలు జరుగుతున్న సమయంలో కవర్ చేయడానికి వెళ్లి నిరసనకారులను ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అని అనడంతో ఈ దాడి జరిగినట్టు వీడియోలు వచ్చాయి.  ఆ తర్వాతే దాడి చేశారని వీడియోల్లో ఉంది.  ఈ ఘటన జరిగాక దీప్తికి బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే దాడి చేసిన వారిని, ట్రోల్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు దీప్తి డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.
Tags:    

Similar News