కవలలకు తండ్రులు ఇద్దరేంటి అనుకుంటున్నారా..? ఔను.. ఒకే తల్లికి పుట్టిన కవలలకు తండ్రులు మాత్రం ఇద్దరు. ఇది సాక్షాత్తు డీఎన్ ఏ పరీక్షలో తేలిన నిజం. వియత్నాంలో ఈ వింత చోటుచేసుకుంది. ఆ దేశంలోని హోవా బిన్ ప్రాంతానికి చెందిన రెండేళ్ల కవలల్లో కనిపించిన ఓ తేడా ఈ సందేహానికి తద్వారా ఈ వింత మనందిరికీ తెలిసేందుకు కారణమైంది.
ఇద్దరు కవల పిల్లల్లో ఒకరికి వెంట్రుకలు పలుచగా ఉండటం, మరొకరికి ఒత్తుగా ఉండటంతో తండ్రికి అనుమానం వచ్చింది. పిల్లలను ఆస్పత్రి సిబ్బంది తారుమారు చేసి ఉంటారేమో అనే అనుమానంతో డీఎన్ ఏ పరీక్షల కోసం వైద్యులను కలిశాడు. దీంతో ఆ ఇద్దరు పిల్లలకు డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరి తల్లి ఒక్కరేనని, అయితే తండ్రులు మాత్రం ఇద్దరని తేలింది!
ఇలా కవలలకు తండ్రులు వేరే ఉండటం చాలా అరుదు. మహిళ నుంచి అండం విడుదలైనప్పుడు దాని జీవితకాలం 12గంటల నుంచి 48 గంటలు ఉంటుంది. ఆ సమయంలో సదరు మహిళ ఇద్దరు పురుషులతో సంభోగంలో పాల్గొని ఉంటుందని, అందుకే కవలలకు తండ్రులు ఇద్దరని తేలిందని వైద్యులు పేర్కొన్నారు. అయితే ఇపుడు ఆ రెండో తండ్రి ఎవరో తేల్చేపనిలో వియత్నం తండ్రి బిజీగా మారినట్లున్నారు!