ఒకరి పాస్ పోర్ట్ తో ఒకరు.. 30 సార్లు విదేశీ ప్రయాణాలు

Update: 2022-07-05 16:30 GMT
సాధారణంగా కవలలు ఒకే రూపంలో ఉండటం వల్ల అందులో ఎవరు ఎవరో కొన్నిసార్లు గుర్తుపట్టడం కష్టమవుతుంది. ఇది ఆసరాగా తీసుకుని కొందరు ట్విన్స్ వాళ్ల ఇంట్లో వాళ్లని, స్నేహితులను అప్పుడప్పుడు ఆటపట్టిస్తున్నారు. కానీ చైనాకి చెందిన ఇద్దరు ట్విన్ సిస్టర్స్ ఏకంగా అధికారులనే బురిడీ కొట్టిద్దామనుకుని చివరకు కటకటాల పాలయ్యారు. ఇంతకీ ఈ కవల సోదరీమణుల స్టోరీ ఏంటంటే..?

ఉత్తర చైనా నగరమైన హర్బిన్‌కు చెందిన 'హాంగ్', 'వీ' కవలలు. వీరిని 'జౌ' సోదరీమణులు గా పిలుస్తుంటారు.  హాంగ్ తన జపనీస్ భర్తతో కలిసి జపాన్‌కు వెళ్లానుకుంది. ఈ క్రమంలో వీసా ఆమె పదేపదే తిరస్కరణకు గురైంది.

హాంగ్ సోదరి 'వీ'కి అప్పటికే జపనీస్ వీసా ఉంది. ఇద్దరి ముఖ కవలికలు ఒకే విధంగా ఉండటంతో హాంగ్.. వీ పాస్ పోర్టు తో జపాన్ వెళ్లాలని నిర్ణయించుకుంది.ఆ విధంగా హాంగ్ సోదరి పాస్పోర్ట్ మీదనే జపాన్, రష్యా, చైనా మధ్య కనీసం 30 సార్లు ప్రయాణించింది. ఈ క్రమంలో చివరికి దొరికిపోయింది.

విషయం బయటపడ్డాక.. ఆశ్చర్యపోవడం అధికారుల వంతు అయ్యింది. 'వీ' కూడా తన సోదరి పాస్పోర్ట్తో నాలుగు సార్లు థాయ్‌లాండ్ వెళ్లి వచ్చింది. చివరికి ఈ మోసాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. మే నెలలో చైనా కు వచ్చిన వారిని అరెస్టు చేశారు. అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉన్నా.. ఈ మోసం ఎలా జరిగిందంటూ అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

ఈ అక్కా చెల్లెళ్ల పాస్పోర్ట్ వ్యవహారం.. తెలివి తేటలు.. చైనీస్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.  "గుర్తింపును మార్చుకున్న కవలలు 30 కంటే ఎక్కువ సార్లు విదేశాలకు వెళ్లారు" (#twins exchanged identities and went abroad more than 30 times ) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండింగ్ అయింది. ఇప్పటి వరకూ  360 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. లక్షలాది మంది కామెంట్స్ చేస్తున్నారు.

ఈ అక్కాచెల్లెళ్ల కథ.. సినిమా స్క్రిప్ట్ ను తలిపిస్తుందని.. అసలు ఇన్ని సార్లు ఎలా  ఇమ్మిగ్రేషన్ అధికారులను మోసం చేయగలిగారు అంటూ కొంతమంది నెటిజన్లు షాక్ తింటున్నారు. " నా స్థానంలో నా కవల సోదరుడు పరీక్షలకు హాజరు కావాలని నేను కలలు కన్నాను" అని ఓ వ్యక్తి ఫన్నీగా కామెంట్ చేశాడు.
Tags:    

Similar News