ఇక నుంచి ట్విట్టర్ లో ఉండాలంటే డబ్బులు కట్టాల్సిందే. ఇన్నాళ్లు ఉచితంగా వాడిన ఈ సోషల్ మీడియాను ఇక నుంచి డబ్బులు పెట్టి వాడుకోవాలి. అవును.. వారంతా డబ్బులు చెల్లించాల్సిందేనని ట్విట్టర్ కొత్త యజమాని ఎలన్ మస్క్ తెలిపారు. ట్విట్టర్ ఎవరికి ఫ్రీ.? ఎవరు డబ్బులు చెల్లించాలనే వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు, సామాన్యులు చాలా మంది ట్విట్టర్ ను ఉచితంగా విరివిగా వాడుతున్నారు. న్యూస్, సినిమా అప్ డేట్స్, ప్రముఖుల గురించి సమాచారంతోపాటు అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు చాలా మంది ట్విట్టర్ చూస్తారు. ఇప్పటివరకూ అందరికీ ఉచితంగానే ట్విట్టర్ సర్వీసులు లభించేవి. కానీ ఇకపై అలా ఉండదు. ట్విట్టర్ అందరికీ ఉచితం కాదు. ట్విట్టర్ ఖాతా కలిగిన వాణిజ్య వినియోగదారులు, ప్రభుత్వ సంస్థలు ఇక నుంచి ఫీజు చెల్లించాల్సిందేనని ట్విట్టర్ యజమాని ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. అది స్వల్ప మొత్తంలో ఉంటుందని పేర్కొన్నారు.
సాధారణ వినియోగదారులు మాత్రం రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎప్పటిలానే ట్విట్టర్ ను ఉచితంగా వాడుకోవచ్చు. ట్విటర్ ను వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సంస్థలు,ప్రభుత్వాలు మాత్రమే చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
ప్రపంచంలోనే నంబర్ 1 ధనవంతుడు, టెస్లా కార్ల యజమాని అయిన ఎలన్ మస్క్ ఇటీవల ట్విట్టర్ ను కొనుగోలు చేశారు. ఎలన్ మస్క్ ట్విట్టర్ లో 9.2 శాతం షేర్లను కలిగి ఉన్నాడు. ఎలన్ మస్క్ కు ట్విట్టర్ అమ్మకానికి ఆమోదం తెలిపింది. ట్విట్టర్ మస్క్ ఆఫర్ కు అంగీకరించింది. దాదాపు 44 బిలియన్ డాలర్ల(రూ.33,64,28,40,00,000 కోట్లు) ను ట్విట్టర్ కొనుగోలుకు ఎలన్ మస్క్ వెచ్చించాడు. ట్విట్టర్ ప్రతీ షేర్ కు రూ.54.20 డాలర్లు చెల్లించాడు.
ఒప్పందం పూర్తి కావడంతో ట్విట్టర్ ప్రైవేట్ కంపెనీగా మారుతుంది. ఎలన్ మస్క్ యాజమాన్యంలోని ఇక ట్విట్టర్ తన సరికొత్త ప్రయాణాన్ని సాగించనుంది. మొత్తానికి ప్రపంచ నంబర్ 1 కుబేరుడు చేతిలోకి అతిపెద్ద సోషల్ మీడియా చేరింది.
ట్విట్టర్ ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్లాక అందులో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాక్ స్వాతంత్ర్యానికి మరింత అనువైన వేదికగా ట్విట్టర్ ను తీర్చిదిద్దుతానని.. కొత్త ఫీచర్లను తీసుకొస్తానని ఎలన్ మస్క్ స్పష్టం చేశారు.