ఈఎస్ ఐ స్కాంలో మరిన్ని అరెస్టులు

Update: 2019-12-22 06:41 GMT
సంచలనంగా మారిన ఈఎస్ ఐ స్కాంలో అరెస్టుల పరంపర సాగుతోంది. డైరెక్టర్ దేవికారాణితో కుమ్మక్కై నకిలీ బిల్లుల్ని రూపొందించిన కంపెనీల గుట్టురట్టు చేసే దిశగా ఏసీబీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ కుంభకోణంలో పాత్ర ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు.

షెల్ కంపెనీలను సృష్టించి ఐఎంఎస్ నుంచి బిల్లులు క్లెయిమ్ చేసినట్లుగా ఏసీబీ దర్యాప్తులో తేలింది. దీంతో నిందితులు భూపాల్ రెడ్డి.. రెడ్డి మల్లి నాగేందర్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే దేవికారాణితో పాటు మరో ఫార్మాసిస్ట్ నాగలక్ష్మిని ఏసీబీ అరెస్ట్ చేసింది.

వీరితో పాటు అప్పట్లోనే మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని పలు విధాలుగా విచారించటంతోపాటు.. ఈ కుంభకోణం లెక్కలు తీస్తున్న అధికారులు ఈ స్కాంలో మరికొందరి ప్రమేయం ఉందన్న విషయాన్ని గుర్తించిన ఏసీబీ అధికారులు తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

సికింద్రాబాద్ విశాల్ ఎంటర్ ప్రైజస్ కు చెందిన భూపాల్ రెడ్డి.. వసుధ మార్కెటింగ్ కు చెందిన నాగేందర్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు దేవికారాణికి బినామీలు అంటున్నారు. అక్రమ పద్దతిలో వీరి చేత బిల్లులు క్లెయిం చేయించి.. అలా వచ్చిన మొత్తంతో కామారెడ్డిలోని బిక్ నూర్ లో పెద్ద ఎత్తున పొలాలు కొన్నట్లుగా గుర్తించారు. ఇప్పుడు ఆ లెక్కలు బయటపెట్టే పనిలో అధికారులు తలమునకలై ఉన్నట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News