నాకేమైనా జరిగితే బాబు, పవన్‌ లదే బాధ్యత!

Update: 2016-08-16 04:24 GMT
"నాకు బెరింపు కాల్స్ వస్తున్నాయి - నా కూతురుని కూడా కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి.. ఈ విషయాలపై ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - జనసేన అధినేత పవన్ కల్యాణ్ లదే బాధ్యత" అని అంటున్నారు ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేరంగుల ఉదయ్ కిరణ్. చంద్రబాబు - పవన్ కల్యాణ్ లను విమర్శిస్తూ వ్యాఖ్యలు గతంలో చేశానని.. వారిపై వ్యాఖ్యలు చేసినందుకు తనకు బెదిరంపు కాల్స్ వస్తున్నాయని అంటున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ రావడమే కాకుండా.. తన కుమార్తెను కూడా కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఉదయ్ కిరణ్ చెబుతున్నారు. ఈ వ్యవహారాలు జరగడానికి.. గతంలో తాను ఈ ఇద్దరినేతలపై విమర్శలు చేయడమే కారణమని అంటున్నారు.

అయితే ఈ విషయాలపై పోలీసులకు ఫిర్యాదుచేసినా కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో.. సెంట్రల్ హోం సెక్రటరీకి ఫిర్యాదు చేశానని చెబుతున్న ఉదయ్ కిరణ్... దీనికి స్పందించిన కేంద్రం తనకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించిందని, అయినా కూడా ఏపీ ప్రభుత్వం ఈ విషయం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సమయంలో మానవ హక్కుల కమిషన్లలో కూడా ఫిర్యాదు చేయగా.. పోలీసులు తప్పడు నివేదిక ఇచ్చారన్నారు. ఇక హైకోర్టులో తాను వేసిన పిటిషన్ ను స్వీకరించిన కోర్టు- ఆగస్టు 22 లోపు వివరణ ఇవ్వాలని ఏపీ డీజీపీని ఆదేశించిందని తెలిపారు. ఈ కార్యక్రమాలు ఇలా జరుగుతున్నా తనకు మాత్రం బెదిరింపు కాల్స్‌ రావడం ఆగడంలేదని.. ఈ సందర్భంగా తనకు ఏమైనా జరిగితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు - జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ లే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉదయ్‌ కిరణ్‌ అన్నారు.
Tags:    

Similar News