చాంపియన్స్ ట్రోఫీ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా ఫైనల్లో పాక్ చేతిలో చిత్తయిన ఇండియన్ క్రికెట్ టీమ్ కు కోటక్ మహీంద్రా సీఈవో ఉదయ్ కోటక్ పరోక్షంగా చురకలంటించారు. క్రికెట్ ను ఉదాహరణగా చెబుతూ.. ఇన్వెస్టర్లను హెచ్చరించారు. ``క్రికెట్ లాగే జీవితంలోనూ నిర్లక్ష్యం లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండటం వల్ల దెబ్బతింటారు. ఇండియన్ మార్కెట్లు దూసుకెళ్లడం కూడా ఇలాంటిదే. దీనిని తాత్కాలిక మనుగడగానే చెబుతారు`` అని ఆయన ట్వీట్ చేశారు. చాంపియన్స్ ట్రోఫీ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా ఫైనల్లో పాక్ చేతిలో చిత్తయిన నేపథ్యంలో దానిని ఉద్దేశించి కోటక్ ఈ ట్వీట్ చేశారు.
58 ఏళ్ల ఉదయ్ కోటక్.. 26 ఏళ్ల వయసులో 1985లో కోటక్ కేపిటల్ మేనేజ్ మెంట్ ఫినాన్స్ ను ప్రారంభించారు. 2003లో కోటక్ మహీంద్రా ఫినాన్స్ తొలి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా మారింది. తర్వాత అది కాస్తా బ్యాంక్ అయింది. ప్రస్తుతం ఆయన ఫోర్బ్స్ లిస్ట్ లోనూ స్థానం సంపాదించారు. ఒకవేళ తాను ఎంటర్ ప్రెన్యూర్ కాకపోయి ఉంటే.. క్రికెటర్ అయి ఉండేవాడినని 2014లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కోటక్ చెప్పారు. చిన్నతనంలో క్రికెట్ బాగా ఆడేవాడినని, 20 ఏళ్ల వయసులో బంతి తగిలినప్పటి నుంచి ఆడటం మానేశానని కోటక్ తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/