స్టాలిన్ మంత్రివర్గం ఇదే .. ఉదయనిధి స్టాలిన్‌కు ఆ కీలక శాఖ !

Update: 2021-05-03 11:30 GMT
తమిళనాడు లో ముందు నుండి వస్తున్న  ఊహాగానాలు నిజం అవుతూ స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే బంపర్ విక్టరీ అందుకుంది.  పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మొత్తం 234 నియోజకవర్గాలున్న అసెంబ్లీలో 133 స్థానాలను డీఎంకే కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. డీఎంకేకు ఈ విజయం దశాబ్దకాలం తర్వాత దక్కింది. దీనికి కారణం.. పదేళ్ళపాటు డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్‌ కఠోర శ్రమకు దక్కిన ప్రతిఫలమని పార్టీ వేనోళ్ల కొనియాడుతోంది. ఇక చెపాక్ నియోజకవర్గం నుండి సినీహీరో, స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

చెపాక్ నియోజకవర్గం ..  ఉదయనిధి తాత కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం. 1996, 2001, 2006లో ఇక్కడి నుంచి మూడు సార్లు గెలిచిన కరుణానిధి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2008లో చెపాక్‌, ట్రిప్లికేన్‌ ప్రాంతాలను విలీనం చేశారు. 2011, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ డీఎంకే ఇక్కడ విజయం సాధించింది. ఇప్పుడు తాత స్థానంలో బరిలోకి దిగిన ఉదయనిధి సైతం విజయం సాధించి హాట్‌ టాపిక్‌ గా మారారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఏకంగా ఎమ్మెల్యే అయిపోయారు. చెపాక్ కోటపై డీఎంకే గెలుపు జెండా ఎగరేసిన ఉదయనిధిని తాతకు తగిన మనవడిగా ఆ పార్టీ నేతలు కొనియాడుతున్నారు. దాదాపు 25 రౌండ్లపాటు సాగిన కౌంటింగ్‌లో చెపాక్ నియోజకవర్గం నుంచి తన సమీప ప్రత్యర్థిపై 68 వేలకుపైగా ఓట్ల మెజారిటీ విజయాన్ని సొంతం చేసుకొన్నాడు. ఉదయనిధి స్టాలిన్ విజయం తర్వాత ఆయన డిప్యూటీ సీఎం కాబోతున్నారనే విషయం సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. అయితే , వార్తల వరకు ఒకే కానీ, అయన ఇప్పుడే ఆ పదవి ఇవ్వకపోవచ్చు అని తెలుస్తుంది.

డీఎంకేను  విజయం వరించడంతో ఆయన మంత్రివర్గంపైనా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఆయన మంత్రివర్గంలో చోటు సంపాదించుకునే వ్యక్తులు, వారి శాఖలతో కూడిన ఓ జాబితా సామాజికమాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది. ఆ జాభితాను ఒకసారి చూస్తే ...

1. ఎంకే స్టాలిన్‌ : ముఖ్యమంత్రి

2. దురైమురుగన్‌ : ప్రజాపనుల శాఖ (ఇరిగేషన్‌, ప్రోగ్రాం వర్క్స్‌, లా, న్యాయస్థానాలు, జైళ్లు)

3. కేఎన్‌ నెహ్రూ : హైవేస్‌, మైనర్‌ పోర్ట్స్‌, మైన్స్‌, మినరల్స్‌

4. పొన్ముడి : ఫైనాన్స్‌, ప్లానింగ్‌, లెజిస్టేటివ్‌ అసెంబ్లీ, ఎలక్షన్స్‌, పాస్‌ పోర్ట్‌, పర్సనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ రీఫామ్స్‌

5. ఐ.పెరియస్వామి : ఎలక్ట్రిసిటీ, నాన్‌ కన్వెన్షయల్‌ ఎనర్జీ డెవల్‌పమెంట్‌, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌, ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరెప్షన్‌ యాక్ట్‌

6. ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం : హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, ఎలక్ట్రానిక్స్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

7. కేకేఎస్‌ఎస్ఆర్‌ రామచంద్రన్‌ : ఇండస్ట్రీస్‌, స్టీల్‌ కంట్రోల్‌ అండ్‌ స్పెషల్‌ ఇంటియేటివ్స్‌

8. ఈవీ వేలు : ఎన్విరాన్‌ మెంట్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌, తమిళ అఫిషియల్‌ లాంగ్వేజ్‌, తమిళ్‌ కల్చర్‌, అర్చియాలజీ

9. తంగం తెన్నరసు : స్కూల్‌ ఎడ్యుకేషన్‌, యూత్‌ వెల్ఫేర్‌ అండ్‌ స్పోర్ట్స్‌ డెవల్‌పమెంట్‌

10. సెంథిల్‌ బాలాజీ : మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, రూరల్‌ డెవల్‌పమెంట్‌, పంచాయతీస్‌ అండ్‌ పంచాయత్‌ యూనియన్స్‌, అర్బన్‌ అండ్‌ రూరల్‌ వాటర్‌ సప్లై

11. ఉదయనిధి స్టాలిన్‌ : హౌసింగ్‌, స్లమ్‌ క్లియరెన్స్‌ బోర్డు, టౌన్‌ ప్లానింగ్‌, అర్బన్‌ డెవల్‌పమెంట్‌, సీఎండీఏ

12. అన్బిల్‌ మహేష్‌ : ట్రాన్స్‌పోర్ట్‌, నేషనైల్డ్‌ అండ్‌ మోటార్‌ వెహికిల్స్‌ యాక్ట్‌

13. పూంగోదై అళగి అరుణ : సోషల్‌ వెల్ఫెర్‌, ఉమన్స్‌ అండ్‌ చిల్ట్రన్స్‌ వెల్ఫేర్‌, ఆర్ఫనైజర్స్‌, నూన్‌ మిల్‌ ప్రోగ్రామ్‌

14. పళనివేల్‌ త్యాగరాజన్‌ : ఇన్‌ ఫర్‌ మెషన్‌ టెక్నాలజీ, ఇన్‌ ఫర్‌ మేషన్‌ అండ్‌ పబ్లిసిటీ, ఫిల్మ్‌ టెక్నాలజీ అండ్‌ సినిమాటోగ్రఫీ యాక్ట్‌, స్టేషనరీ అండ్‌ ప్రింటింగ్‌, గవర్నమెంట్‌ ప్రెస్‌

15. ఈరోడ్‌ ముత్తుస్వామి : అగ్రికల్చర్‌, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌, ఆగ్రో సర్వీస్‌, కో-ఆపరేటివ్స్‌, హార్టీకల్చర్‌, షుగర్‌కేన్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ వేస్ట్‌ ల్యాండ్‌ డెవల్‌పమెంట్‌

16. కార్తీకేయ శివసేనాపతి : అనిమల్‌ హస్బెండరీ, మిల్క్‌ అండ్‌ డైరీ డెవల్‌పమెంట్‌

17. సుబ్బులక్ష్మి జగదీశన్‌ : కో-ఆపరేషన్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌ వెల్ఫేర్‌

18. వెల్లకోయిల్‌ స్వామినాథన్‌ : అటవీ శాఖ

19. డాక్టర్‌ ఎళిలన్‌ : ఆరోగ్య శాఖ, వైద్య విద్యాశాఖ

20. పీకే శేఖర్‌బాబు : పౌరసరఫరాల శాఖ

21. టి.సెంగుట్టువన్‌ : మత్స్య శాఖ

22. కె.పిచ్చాండి : ఖాదీ, గ్రామీణ వృత్తుల బోర్బు

23. రేఖా ప్రియదర్శిని : ఆదిద్రావిడుల సంక్షేమం, హిల్‌ ట్రైబ్స్‌ అండ్‌ బాండెబ్‌ లేబర్‌

24. కె.రామచంద్రన్‌ : హ్యాండ్‌లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌

25. ఇనిగో ఇదయరాజ్‌ : కార్మికుల సంక్షేమ శాఖ

26. టీఆర్‌బీ రాజా : రెవెన్యూ, డిప్యూటీ కలెక్టర్స్‌, మణి లెండింగ్‌ చిట్స్‌, రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ కంపెనీస్‌

27. పెరియకరుపన్నన్‌ : కమర్షియల్‌ టాక్సెస్‌, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్‌ యాక్ట్‌

28. ఎస్‌ఎం నాజర్‌ : రూరల్‌ ఇండస్ట్రీస్‌, వక్ఫ్‌ బోర్డు

29. గీతా జీవన్‌ : పర్యాటక శాఖ

30. అనితా రాధాకృష్ణన్‌ : హిందూ దేవాదాయ శాఖ
Tags:    

Similar News