అనిల్ అంబానీ‌.. 21 రోజుల్లో రూ.5446 కోట్లు చెల్లించాల్సిందే !

Update: 2020-05-23 05:45 GMT
ఈ మధ్య రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి టైం అంతగా కలిసి రావడంలేదు. అప్పులు అదృష్టంలా వెంటాడుతున్నాయి. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీ కి ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. రుణ ఒప్పందంలో భాగంగా మూడు చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న 717 మిలియన్‌ డారల్లను( ఆంటే భారత కరెన్సీ లో దాదాపు రూ. 5446 కోట్లు) 21 రోజుల్లోగా చెల్లించాలంటూ రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి శుక్రవారం యూకే కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 ఫిబ్రవరి 2012 లో రిలయన్స్ కామ్ మూడు చైనీస్ బ్యాంకుల నుండి 700 మిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. ఈ రుణానికి అనిల్ అంబానీ తన వ్యక్తిగత హామీని సమర్పించారు. కానీ ప్రస్తుతం కంపెనీ నష్టాల్లో నడుస్తుండటంతో.. తాము ఇచ్చిన రుణం తిరిగి చెల్లించాలని బ్యాంకులు కోర్టును ఆశ్రయించారు. లాక్ డౌన్ వల్ల పిటిషన్‌ను లండన్ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. పిటిషనర్ రుణాలపై వాదనలు విన్న కోర్ట్. అనిల్ అంబానీని రుణ మొత్తం చెల్లించాలని జస్టిస్ నిగెల్ ఆదేశించారు. దీనికి గాను 21 రోజుల గడువును కూడా విధించింది.

3.2 క్లాజ్ ప్రకారం తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోవడంతో, గ్యారంటీ ఉన్న అనిల్ అంబానీ రుణం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. రుణం చెల్లించేందుకు అనిల్, బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిపై అనిల్ అంబానీ కార్యాలయం హామీ ఇవ్వడానికి అధికారం లేదు అని, తీసుకున్న రుణం చెల్లించాల్సిందేనని స్పష్టంచేశారు. 21 రోజుల్లోగా మూడు చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని మొత్తం చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకావం ఉందంటూ తీర్పునిచ్చారు.
Tags:    

Similar News