సంబంధం లేనట్లు ఉంటాయి కానీ తరచి చూస్తే చాలానే సంబంధాలు కనిపిస్తుంటాయి. అక్కడెక్కడో జరుగుతున్న ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్దం భారత న్యూస్ పేపర్ల మీదా.. వాటి యాజమాన్యాల మీద భారీగా పడుతుందన్న మాట వినిపిస్తోంది.
కరోనా దెబ్బకు కకావికలమైన ప్రింట్ మీడియాకు తాజా యుద్ధం పిడుగు మాదిరే అన్న మాట వినిపిస్తోంది. త్వరగానే ముగుస్తుందని భావించిన ఉక్రెయిన్ - రష్యా యుద్ధం అంచనాలకు మించి సుదీర్ఘంగా సాగుతోంది. దగ్గర దగ్గర నెల రోజులకు చేరుకుంటున్న ఈ యుద్దం ఎప్పటికి ముగుస్తుందన్నది ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి నెలకొంది.
మరిన్ని రోజులు ఈ యుద్ధం కొనసాగితే దాని ప్రభావం భారత న్యూస్ పేపర్ల మీద కచ్ఛితంగా పడుతుందని చెబుతున్నారు. కరోనా పుణ్యమా అని.. అప్పటివరకు సాగుతున్న న్యూస్ పేపర్ల ప్రయాణాన్ని పూర్తిగా మార్చేయటమే కాదు.. పేపర్ పేజీలను పూర్తిగా తగ్గించేసింది.
కరోనాకు ముందు మొయిన్ ఎడిషన్ 16 నుంచి 22 మధ్య ప్రింట్ కావటమే కాదు మినీ పేరుతో 20నుంచి 24పేజీలు ప్రింట్ చేసేవారు. ఎప్పుడైతే కరోనా మొదలైందో అగ్రశ్రేణి దినపత్రికలు సైతం తమ మినీ ఎడిషన్ ను ఎత్తేయటం తెలిసిందే. ప్రధాన సంచికను కూడా 12 నుంచి 14 పేజీలకు కుదించి.. ఆచితూచి అన్నట్లుగా ప్రింట్ చేస్తున్నారు.
తాజాగా జరుగుతున్న యుద్దం కారణంగా రానున్న రోజుల్లో ప్రింట్ మీడియాకు మరిన్నిసవాళ్లు ఎదురవ్వటం ఖాయమంటున్నారు. దీనికి కారణం మన దేశంలో న్యూస్ పేపర్లు ఉపయోగించే న్యూస్ ప్రింట్ లో 45 శాతం వాటా రష్యాదే. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న పేపర్ మీదనే ప్రింట్ చేస్తుంటారు. రష్యా నౌకాశ్రయాల నుంచి బుకింగ్ లు తీసుకోవటాన్ని పలు అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు నిలిపివేయటంతో.. అక్కడున్న కంటైనర్లన్నీ నిలిచిపోయాయి. రష్యా బ్యాంకులపై ఆంక్షలు వ్యాపారాన్ని మరింత క్లిష్టంగా మార్చాయి.
దీంతో దేశీయ న్యూస్ ప్రింట్ సరఫరాదార్ల కోసం భారత వార్తా పత్రికలు ఇప్పుడు ఎదురుచూస్తున్న పరిస్థితి. పేపర్ మిల్లుల్లో న్యూస్ ప్రింట్ ను తయారీ చేయటంలో కీలకంగా ఉండే సహజవాయువు.. బొగ్గు ధరలు అంతర్జాతీయంగా పెరగటం కూడా మీడియా సంస్థల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. మరోవైపు అతి పెద్ద న్యూస్ ప్రింట్ తయారీదారులుగా పేర్కొనే ఫిన్ లాండ్ లోని యూపీఎం సంస్థ కార్మికులు సమ్మెలో ఉన్న నేపథ్యంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారినట్లు చెబుతున్నారు.
భారత దేశం దిగుమతి చేసుకునే గ్లాసీ న్యూస్ ప్రింట్ దిగుమతుల్లో 60 శాతం ఫిన్ లాండ్ కు చెందిన యూపీఎం సంస్థ నుంచే వస్తుంటుంది. ఇప్పుడా కంపెనీ సమ్మె కారణంగా సరఫరా నిలిపివేయటంతో న్యూస్ ప్రింట్ కొరత పెరిగినట్లుగా చెబుతున్నారు. 2019లో టన్ను న్యూస్ ప్రింట్ ధర 450 డాలర్లు ఉంటే.. ఇప్పుడు ఏకంగా 950 డాలర్లకు చేరుకుంది.
వార్తా పత్రికల తయారీలో 40 నుంచి 50 శాతం వరకు ఖర్చు న్యూస్ ప్రింట్ దే. ఇలాంటివేళ.. వరుస పెట్టి విరుచుకుపడుతున్న కష్టాలు ప్రింట్ మీడియా సంస్థలకు సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో న్యూస్ ప్రింట్ మీద కస్టమ్స్ సుంకాన్ని తగ్గించటం ద్వారా ప్రింట్ మీడియా సంస్థల్ని కేంద్రం ఆదుకోవాలని కోరుతున్నారు. ఏమైనా కరోనాతో మొదలైన కష్టాలు ఇప్పట్లో తగ్గేలా లేవని చెప్పక తప్పదు.