ఆ దేశ కరెన్సీ మీద గాంధీ బొమ్మ?

Update: 2020-08-02 10:10 GMT
జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మతో మన కరెన్సీ ఉండటం తెలిసిందే. ఇటీవల కాలంలో కొందరు జాతీయవాదుల పేరుతో గాంధీతో పాటు.. పలువురు నేతల ఫోటోలతో కరెన్సీ నోట్ల మీద అచ్చేయాలని కోరినా.. ప్రభుత్వం మాత్రం ఇప్పటికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉంటే.. గాంధీ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసేలా ఒక దేశం తాజాగా తన కరెన్సీపైన గాంధీ బొమ్మను అచ్చేసే అంశం ఆసక్తికరంగా మారింది.

ఒకప్పుడు అవిభాజ్య భారత్ ను వందల ఏళ్లు ఏలిన బ్రిటీష్ వారే.. తాజాగా తమ కరెన్సీ మీద గాంధీ బొమ్మను అచ్చేసే అంశాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్న తీరు అందరిని ఆకర్షిస్తోంది. భారత్ లో 1987నుంచి కరెన్సీ మీద గాంధీ బొమ్మ ఉండటం తెలిసిందే. తాజాగా యూకే విడుదల చేసిన కరెన్సీ మీద గాంధీ బొమ్మను అచ్చేయటం.. అలాంటి ఘనతను సొంతం చేసుకున్న తొలి శ్వేతజాతీయేతరుడిగా గాంధీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

ది రాయల్ మింట్ అడ్వైజరీ కమిటీ తమ కరెన్సీ మీద గాంధీ బొమ్మను అచ్చేసే విషయాన్ని సీరియస్ గా ఆలోచిస్తోంది. దీనికి పలువురు మద్దతు ఇస్తున్నారు. బ్రిటన్ ఈ రోజు ఇలా ఉందంటే దానికి కారణం అందరి చేయూత ఉందని.. ఆ విషయం భావితరాలకు తెలిసేలా గాంధీ బొమ్మను అచ్చేయాలని కోరుతున్నారు.

బ్రిటన్ దేశంలో కరెన్సీని ముద్రించే రాయల్ మింట్ అడ్వైజరీ కమిటీ సొంతంగా పని చేస్తుంది. యూకే కరెన్సీలో ముద్రించే నాణెల మీద ఎవరెవరి బొమ్మలు అచ్చు వేయాలన్నది ఆ సంస్థే నిర్ణయిస్తుంది. తాజాగా గాంధీ బొమ్మను అచ్చేయటం ద్వారా తర్వాతి తరాల వారికి ఆదర్శంగా నిలుస్తుందన్న మాట వినిపిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. గాంధీ బొమ్మతో యూకేలో నాణెలు అచ్చు కావటం ఎక్కువ దూరం లేదనే మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News