ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఓ రాష్ట్ర రాజధానిలా కాకుండా వ్యాపారాలకు రాజధానిలా చేస్తున్నారా.?........
ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరగడం లేదా.?.....
అమరావతి తెలుగుదేశం నాయకులకు ఆస్తుల రాజధానిగా మారిందా? ..
ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సీనియర్ నాయకుడు, రాజమహేంద్రవరం లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సంధించిన ప్రశ్నలు. అమరావతి కోసం విడుదల చేసిన బాండ్లు చట్ట వ్యతిరేకమని, అవి నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. అమరావతి బాండ్లకు అధిక వడ్డి ఇవ్వాల్సిన అవసరం మేమిటని ఆయన ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి హడ్కో తక్కువ వడ్డికి రుణం ఇస్తున్న ఎందుకు తీసుకోవడం లేదని ఉండవల్లి ప్రశ్నించారు. అమరావతి రాజధాని నిర్మణాన్ని వ్యాపారంలా చూస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదని ఉండవల్లి హితవు పలికారు.
రాజధాని నిర్మాణం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సీఆర్డీఏను ఓ వ్యాపార సంస్థలా మార్చేశారని, దీనిని సాకుగా చూపించి వడ్డీలు తెచ్చుకుంటే మంచిదని ఉండవల్లి ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబ రావుతో చర్చించేందుకు తాను సిద్ద మని ఉండవల్లి స్పష్టం చేసారు. ఈ చర్చలో అమరావతి బాండ్లు, పోలవరం, పట్టిసీమతో సహా బలహీన వర్గాల కోసం నిర్మిస్తున్న ఇళ్లు, ముఖ్యమంత్రి ప్రకటించిన 18 లక్షల కోట్ల పరిశ్రమల స్థాపన వంటి అంశాలపై కూడా చర్చించాలన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే ఆ చర్చలోనే క్షమాపణ చెప్పి వెళ్లిపోతానని, మళ్లీ ఎన్నికల వరకూ తాను ఏమి మాట్లాడనని ఉండవల్లి సవాల్ విసిరారు. అమరావతిలో రాజధానిని ప్రజల కోసం కడుతున్నారా లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా అని ప్రశ్నించారు. చదరపు గజం నిర్మాణానికి రూ 1500 ఖర్చు అవుతుంటే ప్రభుత్వం మాత్రం రూ 3000 కాంట్రాక్టర్లకు ఇస్తోందని ఆరోపించారు. ఇది కాంట్రాక్టర్లకు దోచి పెట్టడం కాదా అని ప్రశ్నించారు. రాష‌్ట్రంలో 18 లక్షల కోట్ల విలువ చేసే పరిశ్రమలు వచ్చాయన్న ముఖ‌్యమంత్రి చంద్రబాబు నాయుడు అవి ఎక్కడ ఉన్నాయో చూపించాలని డిమాండ్ చేసారు.