నిన్నటి వరకూ పెదవి విప్పని ఉండవల్లి అరుణ్ కుమార్.. గాఢ నిద్ర నుంచి చటుక్కున లేచినట్లుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడటం షురూ చేశారు. రహస్యంగా ఉండాల్సిన నల్లధనం వెల్లడి సమాచారం కొందరికి ఎలా తెలుస్తుందంటూ లా పాయింట్ తీశారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడిన కాసేపటికే ఉండవల్లి రియాక్ట్ కావటం గమనార్హం.
ఇటీవల కాలంలో తన ఆప్తుమిత్రుడు దివంగత మహానేత వైఎస్ కుమారుడు జగన్ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్న ఉండవల్లి.. తాజా ఎపిసోడ్ తో జగన్ ఏదైనా విషయాన్ని టేకప్ చేస్తే.. తాను కూడా గళం కలుపుతానన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పొచ్చు. ఇక.. ఉండవల్లి మాటలు చూస్తే.. నల్లధనం వివరాల్ని వెల్లడించిన వారి వివరాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఐడీఎస్ 2016 జాబితా అధికారికంగా విడుదల చేయలేదని స్పష్టం చేసిన నేపథ్యంలో.. తనకు సమాచారం తెలిసిందంటూ చంద్రబాబు ఎలా ప్రచారం చేసుకుంటారు? అని ఉండవల్లి ప్రశ్నించారు.
ఏపీ ముఖ్యమంత్రికి కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అధికారికంగా ఏదైనా సమాచారం ఇచ్చారా? అంటూ బాబుతో పాటు.. కేంద్రమంత్రి ఆర్థికమంత్రిని కూడా ఉండవల్లి సీన్లోకి తీసుకొచ్చారు. ఒకవేళ కేంద్ర ఆర్థిక శాఖ కానీ సమాచారం ఇవ్వకుంటే చంద్రబాబు ఇష్టానుసారం ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. చూస్తుంటే.. జగన్ మాట్లాడిన అంశంపై ఒకరి తర్వాత ఒకరు గళం విప్పటమేమిటి చెప్మా..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/