దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది.. జీడీపీ, వృద్ధి రేటు రోజురోజుకు క్షీణిస్తోంది. ఆర్థిక మాంద్యం లేదని అవాస్తవం చెబుతున్నారని అందరికీ తెలిసిందే. దాని ప్రభావంతో పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. రెండంకెల వృద్ధి రేటు సాధిస్తామని ఎన్నికల ముందు పేర్కొన్న నరేంద్రమోదీ తన ఆరేళ్ల పాలనలో సింగిల్ సంఖ్యకే పరిమితం కాగా.. అది మరీ ఐదో లోపు వృద్ధి రేటు నమోదు చేసుకోవడంతో దేశ ఆర్థిక పరిస్థితి ఊబిలో చిక్కుకుపోయింది. ఇది అందరికీ తెలిసినా ఎవరూ నోరు మెదపరు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికే కశ్మీర్, పాకిస్తాన్ భూతం, సీఏఏ, ఎన్పీఆర్ లాంటి తదితర అంశాలు తీసుకొచ్చి ప్రజల దృష్టిని మరల్చుతున్నారు. ఈ విషయంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్ర మోదీ ఆరేళ్ల పాలనతో దేశం నాశనమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నోట్ల రద్దు, జీఎస్టీతో సామాన్యులతో పాటు వ్యాపారుల నడ్డి విరిగిందని, నిరుద్యోగ సమస్య, జీడీపీ తగ్గిపోవడంపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదని విమర్శలు చేశారు. నానాటికీ దిగజారిపోతున్న జీడీపీపై ఉండవల్లి చక్కని ఉదాహరణతో వివరించారు. గతంలో మన దేశం సాయమందించిన బంగ్లాదేశ్ జీడీపీ ఇప్పుడు భారత్ జీడీపీ కన్నా అధికంగా ఉందని తెలిపారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ గాడీలో పడిందని, నరేంద్ర మోదీ హయాంలో నాశనమైందని విమర్శించారు.
దీంతో పాటు ఆర్థిక వ్యవస్థను చక్కబట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. కేవలం హిందుత్వ, పాకిస్థాన్ ఎజెండాతో కేంద్రం ప్రభుత్వ పాలన సాగుతోందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కనీస ప్రయత్నాలు చేయడం లేదని మాజీ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మెయిల్ పంపానని, తన మెయిల్‌ను కేంద్రం పట్టించుకుంటుందో లేదోనని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాను ఆర్ఎస్ఎస్ లో పనిచేశానని గుర్తుచేశారు. గతంలో కొన్ని రోజులు ఆర్ఎస్ఎస్‌కు వెళ్లానని చెప్పారు.