న‌ల్ల‌ధ‌నంపై మోడీకి ఉండ‌వ‌ల్లి లేఖ‌!

Update: 2016-10-14 08:06 GMT
స్వ‌చ్ఛంద న‌ల్ల‌ధ‌న ప‌థ‌కం ఏపీ రాజ‌కీయాల్లో వేడి పుట్టిస్తోంది. హైద‌రాబాద్ లో 13 వేల కోట్లు వెల్ల‌డైతే అందులో ఒక్క జ‌గ‌నే 10 వేల కోట్లు వెల్ల‌డించారంటూ చంద్ర‌బాబు ప‌రోక్ష ఆరోప‌ణ‌లు చేస్తుండ‌డం.. ఏపీ మంత్రి దేవినేని అయితే డైరెక్టుగా విమ‌ర్శ‌లు చేస్తుండ‌డంతో వైసీపీ కూడా డైరెక్ట‌యిపోయింది. న‌ల్ల‌ధ‌నం వ్య‌వ‌హారంలో వాస్త‌వాలేమిటో వెల్ల‌డించాలంటూ జ‌గ‌న్ నేరుగా ప్ర‌ధాని మోడీకి లెట‌ర్ రాశారు.  చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరిపి… పది వేల కోట్లు ప్రకటించిన వ్యక్తి పేరు బయటపెట్టాలని జగన్ తన లేఖ‌లో డిమాండ్ చేశారు.  తాజాగా  మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కూడా ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి లేఖ రాశారు. దీంతో మ‌రింత వేడి మొద‌లైంది.

ఏదైనా ప‌ట్టుకుంటే దాని అంతుచూసే ర‌క‌మైన ఉండ‌వ‌ల్లి న‌ల్ల‌ధ‌నం విష‌యంలో కేంద్రానికి లేఖ రాయ‌డంతో విష‌యం స్పీడందుకుంటున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. నల్లధనం ప్రకటించిన వారి వివరాలు బయటపెట్టబోమని కేంద్రం చెబుతోందని… కానీ చంద్రబాబుకు ఆ వివరాలు ఎలా తెలిశాయని ఉండ‌వ‌ల్లి త‌న లేఖ‌లో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఒక్క ఏపీ - తెలంగాణ నుంచే 25 శాతం నల్లధనం బయటపడిందని కూడా ప్రచారం చేస్తున్నారని లేఖలో వివరించారు.

చంద్రబాబు చెబుతున్న‌ట్లుగా రూ. 10వేల కోట్లు ప్రకటించిన ఆ వ్యక్తి ఎవరో చెప్పాలని ఉండవల్లి కేంద్రాన్ని కోరారు.. నల్లధనం వెల్లడించిన వారి వివరాలన్నీ బయటపెట్టాలన్నారు. ఆర్థిక శాఖ చంద్రబాబుకు అధికారికంగా సమాచారం ఇచ్చిందా అని ఆయ‌న ప్రశ్నించారు. అలా జరగనప్పుడు చంద్రబాబు ఇష్టానుసారం ఎలా మాట్లాడుతారని ఉండవల్లి నిలదీశారు. దీంతో చంద్ర‌బాబు చెబుతున్న‌ది అబ‌ద్ధ‌మైనా అయ్యుండాలి లేదంటే కేంద్రం ప్ర‌జ‌ల ర‌హ‌స్యాలు కాపాడే విష‌యంలో ఉదాసీనంగా ఉండాలి. మ‌రి ఉండ‌వ‌ల్లి లేఖ‌పై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News