ప‌వ‌న్‌ కు ఓ లెక్క ఉందంటున్న ఉండ‌వ‌ల్లి

Update: 2018-01-17 11:30 GMT
జ‌న‌సేన పార్టీ అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి సీనియ‌ర్ నేత‌ - మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. జనసేన ర‌థ‌సార‌థి పవన్ కళ్యాణ్‌ ను లక్ష్యంగా చేసుకొని ఇటీవల కాలంలో సినీ విమర్శకులు కత్తి మహేష్ చేస్తున్న విమర్శలపై ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు స‌రైన‌దేన‌ని అన్నారు. ప‌వ‌న్ ప్ర‌స్తుతం వ్య‌వ‌హ‌రిస్తున్నట్లుగానే...క‌త్తి మ‌హేష్‌ పై స్పందించ‌క‌పోవ‌డ‌మే క‌రెక్ట్ అని వ్యాఖ్యానించారు.

ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు - వివిధ అంశాల‌పై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ను ఓ టీవీ చాన‌ల్ ఇంట‌ర్వ్యూ చేయ‌గా...ఆయ‌న ప‌వ‌న్‌ పై ఈ విధంగా స్పందించారు. ప‌వ‌న్ కళ్యాణ్ విషయంలో కత్తి మహేష్ విమర్శలు మొద‌ట కొంత అర్ధవంతంగా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో రొటీన్‌ గా మారిందని వ్యాఖ్యానించారు. అందుకే ఆయ‌న విమ‌ర్శ‌ల‌పై ప‌వ‌న్ పెద్ద‌గా స్పందించలేద‌ని అన్నారు. ఈ తరహ విమర్శల విషయంలో మౌనంగా ఉండడమే పవన్ కళ్యాణ్‌ కు ఉత్తమమని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్‌ పై విమర్శలు చేయడంలో కత్తి మహేష్ కొంత స్కోర్ చేసినట్టు కన్పిస్తోందని - కత్తి మహేష్ తన వాదనను అద్భుతంగా సమర్థించుకోవ‌డం ఇందుకు క‌లిసి వ‌చ్చిన‌ట్లుంద‌ని  ఉండవల్లి అరుణ్‌ కుమార్ అభిప్రాయపడ్డారు. కత్తి మహేష్ విమర్శలపై పవన్ అభిమానులు మాట్లాడుతున్నారని కానీ ప‌వ‌న్ స్పందించడం లేద‌ని పేర్కొంటూ...రాజకీయాల్లో ఉన్న నేతలంతా సంయమనం పాటించాల్సిందేనని ఉండవల్లి అరుణ్‌ కుమార్ సూచించారు.

ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయం గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తూ...పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఏపీ రాష్ట్రంలో ఓ పోర్స్‌ గా తయారయ్యే అవకాశం ఉందని  అభిప్రాయపడ్డారు. ఈ విషయమై తనకు అనుమానం లేదన్నారు. అయితే పార్టీని నిలబెట్టుకోవడం పవన్ చేతుల్లో ఉంటుందని - పవ‌న్ కళ్యాణ్ ఏ మేరకు విజయం సాధిస్తారో చూడాల్సిన అవసరం ఉందని అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రధాన పార్టీలకు చెందిన మద్దతుదారులు - సానుభూతి పరులను వదిలేసి తటస్థ ఓటర్లను ఆకట్టుకొంటేనే రాజకీయాల్లో సక్సెస్ అవుతారని ఉండవల్లి విశ్లేషించారు.
Tags:    

Similar News