కల్తీ మద్యం కేసులో ఇరుక్కుని నెల రోజుల పాటు పరారైపోయి రీసెంటుగా కోర్టులో లొంగిపోయి.. సిట్ విచారణను ఎదుర్కొంటున్న విజయవాడ కాంగ్రెస్ నేత మల్లాది విష్ణుకు కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫుల్ సపోర్టు ఇస్తున్నారు. మల్లాది విష్ణును కల్తీ మద్యం కేసులో అరెస్టు చేయడాన్ని ఉండవల్లి అరుణకుమార్ తప్పు పడుతున్నారు. విష్ణును మద్యం కేసులో ఇరికించారని ఆయన ఆరోపిస్తున్నారు.
ఈ కేసులో ఫోరెన్సిక్ లాబ్ నివేదిక వచ్చిందని... అయినా ప్రభుత్వం దాన్ని బయటపెట్టడం లేదని... అంటే ఏదో మతలబు ఉందని... నివేదికలు మార్చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రాజకీయ కోణంలోనే విష్ణును అరెస్టు చేశారని ఉండవల్లి అన్నారు. హెరిటేజ్ పాలు తాగి ఎవరైనా చనిపోతే చంద్రబాబును అరెస్టు చేస్తారా? అని ఆయన విచిత్రమైన ప్రశ్న వేశారు. విష్ణును అప్రతిష్టపాలు చేసేందుకే మద్యం షాపులోని వాటర్ కూలర్ లో విషం కలిపారని ఆయన ఆరోపించారు.
అంతేకాదు.... జైలులో పెట్టినంతమాత్రాన విష్ణు ప్రతిష్ట ఏమీ దెబ్బతినదని, గతంలో వంగవీటి రంగాను జైలులో పెడితే, బయటకు వచ్చి ఆయన ఏ స్థాయికి ఎదిగారో చూశామని అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎదుగుదలో, రౌడీయిజంలో ఎదుగుదలో? ఏ ఉద్దేశంతో అన్నారో ఉండవల్లి స్పష్టం చేస్తే ఇంకా బాగుంటుంది.