అమెరికా అమ్మాయిల క్రికెట్ జట్టు.. అంతా మన భారత అమ్మాయిలే

Update: 2022-12-15 11:42 GMT
అందులేరు.. ఇందుగలదు అన్నట్టు ఎందెందు చూసిన మన భారతీయులే కనిపిస్తున్నారు. అన్ని దేశాలకు పాకి అక్కడ స్థిరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆదేశంలో రాణిస్తూ వ్యాపారులుగా, ఉద్యోగులుగా.. రాజకీయ నేతలుగా ఎదుగుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో టాప్ సంస్థలను నడిపించేది మన భారతీయులే కావడం విశేషం.

భారతీయులకు సహజంగానే క్రికెట్ అంటే పిచ్చి ప్రేమ. భారత్ లో క్రికెట్ ఒక మతం లాంటిది. అది మనోళ్లు అమెరికా వెళ్లినా కూడా వీడడం లేదు. అమెరికాలో అస్సలు క్రికెట్ కు ఆదరణ ఉండదు. అలాంటి చోట మనోళ్లు క్రికెట్ లో రాణిస్తూ అదరగొడుతున్నారు.

ప్రస్తుతం అమెరికాలో క్రికెట్ ఫీవర్ పట్టుకుంది.  ఇప్పటికే అమెరికా ప్రొఫెషనల్ పురుషుల క్రికెట్ వన్డే, మరియు టీ20  జట్టును కలిగి ఉంది. పలు టోర్నీల్లోనూ ఆడుతోంది. ఇప్పుడు అమెరికా మహిళల టీంలు కూడా రూపాంతరం చెందాయి. అమెరికా అండర్-19 మహిళల టీ20  జట్టును తాజాగా ప్రకటించింది.

 "వచ్చే సంవత్సరం దక్షిణాఫ్రికాలో ప్రారంభమయ్యే ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ప్రాతినిధ్యం వహించే 15 మంది ఆటగాళ్ల జట్టును ప్రకటించారు. అమెరికా  క్రికెట్ అసోసియేషన్ నుంచి జట్టు సభ్యులతో ప్రకటన జారీ చేశారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అమెరికా అండర్-19 జట్టులో తెలుగు మూలాలున్న అమ్మాయిలు ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు.  కెప్టెన్ గా గీతిక కోడలి స్వయంగా తెలుగు ఒరిజినల్ వ్యక్తి. 15 మంది సభ్యుల జట్టులో ఇతర తెలుగు సంతతి అమ్మాయిలు భూమిక భద్రిరాజు, లాస్య ముళ్లపూడి, సాయి తన్మయు ఎయ్యుని , రిజర్వ్ ప్లేయర్ కస్తూరి వేదాంతం ఉన్నారు. "యుఎస్‌ఎ మహిళల అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్‌లో యునైటెడ్ స్టేట్స్‌కు ప్రాతినిధ్యం వహించిన మొదటి మహిళా క్రికెట్ జట్టుగా  చరిత్ర  సృష్టిస్తుంది. ఇందులో మెజార్టీ మన తెలుగు అమ్మాయిలు అందునా భారతీయులే ఉండడం విశేషంగా చెప్పొచ్చు.
 
అమెరికా 2010లో పురుషుల అండర్ 19 జట్టు ప్రపంచకప్ ఆడగా.. తాజాగా ఆ దేశ మహిళా జట్టు కూడా తొలిసారి ప్రపంచకప్ లో బరిలోకి దిగుతోంది. దక్షిణాఫిక్రాలో జనవరి 7వ తేదీ నుంచి 29 వరకూ ఈ టోర్నీ జరుగనుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News