ఈ రోజు ఉదయం11 గంటలకు ప్రవేశ పెట్టాల్సిన కేంద్ర బడ్జెట్ వాయిదా పడనుందా? అంటే.. అవునని చెబుతున్నారు. ముందుగా అనుకున్న విధంగా కాకుండా.. రేపటికి (ఫిబ్రవరి2) బడ్జెట్ ను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నిన్న సభలో తీవ్రఅస్వస్థతకు గురైన కేరళ ఎంపీ ఇ. అహ్మద్ ఈ తెల్లవారుజామున మరణించటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బడ్జెట్ ను ఈ రోజు వాయిదా వేసి.. రేపు ప్రవేశ పెట్టనున్నట్లుగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి గాంగ్వార్ ప్రస్తావిస్తూ.. సభలో సభ్యుడైన వ్యక్తి మరణిస్తే.. సభను వాయిదా వేయటం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ను వాయిదా వేసే విషయంపై లోక్ సభస్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆయన చెబుతున్నారు. దీంతో.. బడ్జెట్ వాయిదా నిర్ణయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం..బడ్జెట్ ను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ రోజు చాలా మంచి రోజు కావటం.. తొలిసారి బడ్జెట్ ను ముందుకు జరిపి.. రైల్వే.. సాధారణ బడ్జెట్ లను కలిపి సభలో ప్రవేశపెడుతున్న వేళ.. అనుకోని విధంగా జరిగిన ఈ పరిణామంపై ఎన్డీయే సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సభను హాజరుపరిచి సంతాపం వ్యక్తం చేసి సభను వాయిదా వేయటం.. కాసేపటి తర్వాత మళ్లీ సభ ఏర్పాటు చేసి బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఏమైనా.. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పినా.. ప్రధాని మోడీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్న మాట రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/