ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర రావు!

Update: 2020-02-17 06:20 GMT
ఆసరాతో ఆప్తుడయ్యాడు..
రైతుబంధుతో బంధువయ్యాడు..
రైతుబీమాతో భోజుడయ్యాడు..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తో మేనమామయ్యాడు..
కేసీఆర్ కిట్ తో తాతయ్యాడు..
మిషన్ భగీరథ, కాకతీయతో జలాధీశుడయ్యాడు
నిరంతర విద్యుత్తుతో వెలుగులు వెదజల్లుతున్నాడు..
కాళేశ్వరంతో జలసిరులు కురిపించాడు..
స్వరాష్ట్రం తెచ్చాడు.. స్వర్ణకాంతులు వెలిగిస్తున్నాడు..
ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర రావు

దశాబ్దాల పోరాటం సాగించి.. చావుకు ఎదురెళ్లి పోరాడి.. తను కాంక్షించిన రాష్ట్రం సాధించుకుని తాను కలలుగన్న రాష్ట్రాన్ని రూపుదిద్దుతూ బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా అడుగులు వేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. 2001లో ఒక్కరితో ప్రారంభించిన పోరాటం తెలంగాణ రాష్ట్రంతో అపూర్వ విజయం సాధించి ఇప్పుడు అందరితో కలిసి సాగుతూ ప్రగతి పథంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాడు. రాజకీయాలు వేరు.. పరిపాలన వేరు అని బేధం చూపిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములను చేస్తున్నాడు. కేసీఆర్ కు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా వీరాభిమానం ఉంది. అది పలుసార్లు నిరూపితమైంది కూడా.

ఉమ్మడి మెదక్ జిల్లా చింతమడక గ్రామంలో కేసీఆర్ 1954 ఫిబ్రవరి 27న జన్మించారు. ఆయన 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లో ప్రవేశించారు. ఆ తర్వాత 1985లో తొలిసారిగా సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా పేరు పొందారు. ఆ కాలంలోనే నందమూరి తారక రామారావు మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. అనంతరం చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతిగా పని చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవులు త్యజించి కొంతమందితో 2001లో టీఆర్ఎస్ స్థాపించి ఉద్యమబాట పట్టారు. అప్పటి నుంచి ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ తో పొత్తు, కేంద్రంలో మంత్రిగా కేసీఆర్ బాధ్యతలు.. అనంతరం టీడీపీ, కమ్యూనిస్టులతో పొత్తు చేసుకుని రాజకీయాల్లో కొనసాగారు. చివరకు గిట్లయితే తెలంగాణ రాదని భావించి 2009 నుంచి ఉద్యమం తీవ్ర రూపం చేశారు. చివరకు ఆమరణ దీక్షకు కూర్చొని తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనేలా చావు దాక వెళ్లేలా ఆమరణ దీక్ష చేశారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం డిసెంబర్ 9 ప్రకటనతో దీక్ష విరమించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఉద్యమాన్ని కేసీఆర్ ఉగ్రరూపం దాల్చేలా చేశారు. సమైక్యవాదులు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ కేంద్రం మెడలు వంచి.. అప్పటి హైదరాబాద్ తో కూడిన 9 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు.

అనంతరం 2014లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావం నాడే ప్రమాణ స్వీకారం చేశారు. వచ్చుడుతోనే అద్భుతమైన పరిపాలన నిర్ణయాలు తీసుకుంటూ.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తూ కేసీఆర్ పేరుప్రతిష్ఠలు సంపాదించాడు. అనూహ్యమైన రాజకీయ నిర్ణయాలు తీసుకుని అందరి దృష్టిలో పడ్డారు. తన రాజకీయ వ్యూహంతో తెలంగాణలో ఇతర పార్టీలను కోలుకోలేని దెబ్బ తీశాడు. తనదైన నిర్ణయాలతో తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగిరేలా చేశాడు. అనంతరం 2018లో అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి అద్భుతమైన ఫలితాలు సాధించి తిరుగులేని విజయాన్ని కేసీఆర్ సృష్టించాడు. రెండో పర్యాయంలోనూ తన పాలనతో దూసుకెళ్తున్నాడు. ఆయన పరిపాలనకు ఫలితాలే రెఫరెండంగా భావిస్తున్నారు. అందుకే స్థానిక, పంచాయతీ, మున్సిపల్, సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అపూర్వ ఫలితాలు సాధిస్తోంది. అలాంటి పాలన పరమైన నిర్ణయాలతో దూసుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలని తుపాకీ ఆకాంక్షిస్తోంది. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న అపర భగీరథుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ కు తుపాకీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది.
Tags:    

Similar News