జాతిపిత గురించి మ‌నకు తెలియ‌ని 16 నిజాలు

Update: 2016-01-29 18:30 GMT
మోహ‌న్ దాస్ క‌రంచంద్ గాంధీ...దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు అంద‌రినీ ఒక్క‌తాటిపైకి న‌డిపించిన నాయ‌కుడు. దేశ‌మంతటినీ ముందుకు న‌డిపించి అహింసా విధానం ద్వారా స్వేచ్చాగాలులు పీల్చుకునేలా చేసిన జాతిపిత‌. నేడు గాంధీ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఆయ‌న గురించి మ‌నకు తెలియ‌ని 16 ఆస‌క్తిక‌ర అంశాలు.

1.నోబెల్ శాంతి బ‌హుమ‌తికి ఇప్ప‌టివ‌ర‌కు గాంధీజీ ఐదు సార్లు నామినేట్ అయ్యారు.

2. నాలుగు ఖండాలు, 12 దేశాల్లో ప్రజాస్వామ్య హ‌క్కుల కోసం జ‌రిగిన ఉద్య‌మాల‌కు గాంధీజీ స్పూర్తి.

3.మ‌హాత్మా గాంధీ అంతిమ యాత్ర సంద‌ర్భంగా సాగిన యాత్రలో 8కిలోమీట‌ర్ల పొడవున జ‌నం బారులు తీరారు.

4.మనం స్వాతంత్ర్యం కోసం ఏ బ్రిట‌న్‌ కు వ్య‌తిరేకంగా అయితే పోరాటం చేశామో...అదే దేశం గాంధీజి మ‌రణించిన 21 ఏళ్ల త‌ర్వాత ఆయ‌న పేరుతో ప్ర‌త్యేక స్టాంప్‌ ను విడుద‌ల చేసింది.

5.మ‌హాత్మాగాంధీ జీవిత కాలంలో ఆయ‌న న‌డ‌క‌/ప‌్ర‌యాణం మొత్తాన్ని లెక్క‌వేస్తే..రోజుకు 18 కిలోమీట‌ర్లు చుట్టివ‌చ్చిన‌ట్లు తేలింది.

6.గాంధీజీ ఆర్మీలో కూడా త‌న సేవ‌లు అందించారు. అయితే యుద్ధం వ‌ల్ల వ‌చ్చే దుష్ప‌రిణామాల‌ను గ్ర‌హించి ఆయ‌న సైన్యానికి గుడ్‌ బై చెప్పారు.

7.మ‌హాత్మాగాంధీ అనేక మందితో ఉత్త‌ర‌-ప్ర‌త్యుత్త‌రాలు న‌డిపించారు. టాల్‌ స్టాయ్‌ - ఐన్‌ స్టీన్‌ - హిట్ల‌ర్ వంటివారు ఇందులో ఉన్నారు.

8.దేశానిక స్వాతంత్ర్యం వ‌చ్చి మ‌న పౌరులంతా ఆనందోత్సాహాల్లో ఉన్న స‌మ‌యంలో... నెహ్రూ ప్ర‌సంగం జ‌రుగుతున్న స‌మ‌యంలో గాంధీజీ అక్క‌డ లేరు. కోల్‌ క‌తాలో ఉన్నారు.

9.అత్యంత బాధాక‌ర‌మైన అంశం ఏమిటంటే...గాంధీజీకి చెందిన జ్ఞాపిక‌ల్లో ముఖ్య‌మైనవే భద్ర‌ప‌ర‌చ‌లేదు. గాంధీ దుస్తులు వంటివి కూడా మదురైలోని ఆయ‌న మ్యూజియంలో భ‌ద్ర‌ప‌ర‌చ‌లేదు.

10. ఏ రాజ‌కీయ పార్టీలో కూడా ఆయ‌న ప‌ద‌వులు తీసుకోలేదు.

11. కాంగ్రెస్ పార్టీని మూసివేయాల‌ని త‌న చివ‌రి రోజుకు ముందు గాంధీజీ నిర్ణ‌యం తీసుకున్నారు.

12.స్టీవ్ జాబ్స్ మ‌హాత్మాగాంధీకి వీరాభిమాని. ఆయ‌న ధ‌రించే గుండ్ర‌ని క‌ళ్ల‌ద్దాలు కేవ‌లం అభిమానం చాటుకునేందుకే కాదు...మ‌హాత్ముడికి నివాళి కూడా!

13.గాంధీజీకి రెండు పెట్టుడు ప‌ళ్లు ఉండేవి. అవి ఆయ‌న ఎప్పుడూ వెంట తీసుకువెళ్లేవారు.

14.గాంధీజీ ఇంగ్లిష్‌ ను ఐరిష్ యాస‌లో మాట్లాడేవారు. ఆయ‌న ప్రథ‌మ ఆచార్యులు ఐరిష్ వారు కావ‌డం ఇందుకు కార‌ణం

15.దేశంలో 53 ప్ర‌ధాన ర‌హ‌దారులు, విదేశాల్లో 48 రోడ్లు గాంధీజీ పేరుతో ఉన్నాయి. ఇక చిన్న చిన్న కూడ‌ల్ల‌కు వేల సంఖ్య‌లో ఉన్నాయి.

16. గాంధీజీ విదేశాల్లో 3 ఫుట్‌ బాల్ క్ల‌బ్‌ ల‌ను ఏర్పాటుచేయ‌డంలో క్రియాశీలంగా అడుగులు వేశారు. డ‌ర్బ‌న్‌ - ప్రిటోరియా - జోహ‌న్నెస్‌ బ‌ర్గ్‌ లు ఇందులో ఉన్నాయి.

Tags:    

Similar News