ప్రపంచానికి తెలియని పేద ఎంపీ సారంగి కథ

Update: 2019-06-01 10:36 GMT
రెండు రోజులుగా ఫోన్ ఓపెన్ చేస్తే చాలు.. దేశంలోనే పేద ఈ బీజేపీ ఎంపీ  అని.. ఈ ఒడిషా ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగిని మోడీ కేంద్రమంత్రిని చేశాడని ఒకటే పొగడ్తలు.. మోడీ , సారంగికి ఇచ్చిన గౌరవం అని.. సారంగి నిరాడంబరత, సాధుస్వభావం... సేవనిరతిపై వాట్సాప్, ఫేస్ బుక్ లో అనుకూల కథనాలు ఎన్నో వస్తున్నాయి. తన సంపదనను స్కూళ్లు, పిల్లల కోసం వెచ్చిస్తాడని.. విద్యాసేవ చేస్తాడని.. గుడిసెలో జీవిస్తాడని ఇలా ఎంతో  పాజిటివ్ కోణం వెనుక ఒక నెగెటివ్ కోణం కూడా ఉంది. అది ఎంతో విషాధమైనది కూడా..

ఒడిషాలోని బారాసోల్ నుంచి నుంచి ఎంపీగా గెలిచిన ప్రతాప్ చంద్ర సారంగి అఫిడవిట్ ఒక్కసారి చూస్తే ఆయనపై క్రిమినల్ కేసులు నమోదై ఉండడం గమనించదగ్గ విషయం. ఒక మతప్రబోధకుడు గ్రాహం స్టెయిన్స్ , ఇద్దరు కుమారులను ఇంట్లో ఉంచి సజీవదహనం చేసిన కేసులో 20 ఏళ్ల క్రితం ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆ సమయంలో సారంగి బీజేపీ అనుకూల ఒడిషా భజరంగ్ దళ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక అఫిడవిట్ లో కేసుల ప్రకారం.. మొత్తం ఏడుకేసులు ఆయనపై ఉన్నాయి. మతకలహాలు రెచ్చగొట్టడం.. చిచ్చుపెట్డం.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం లాంటి తీవ్రమైన నేరాలతోపాటు 13 లక్షల ఆస్తులున్నాయి.  

ఇక దేశవ్యాప్తంగా మీడియా ఊదరగొడుతున్నట్టు ఆయన అలాంటి గొప్పతనం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నంతగా ఏమీ లేదని ఒడిషాలోని బాలాసోర్ మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. ఇలా ఒకవైపు సేవాతనంతోపాటు క్రిమినల్ కేసులు సారంగిని వెంటాడుతున్నాయి. అయినా ఈయన ఇలాంటి రెచ్చగొట్టే చేష్టల తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా.. ఇప్పుడు ఎంపీగా గెలిచాడని చెబుతున్నారు.

    

Tags:    

Similar News