అన్‌లాక్‌ 0.1 ..దేశంలో నెం.1 గా ఏపీఎస్‌ ఆర్టీసీ

Update: 2020-06-17 07:00 GMT
లాక్‌ డౌన్‌ సడలింపుల తరువాత  ప్రారంభమైన ప్రజా రవాణా సదుపాయాలలో ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ  దేశంలోనే అగ్రగామిగా నిలిచినట్లు ప్రముఖ ఆన్ ‌లైన్‌ టిక్కెట్‌ బుకింగ్‌ అగ్రిగేటర్‌ అభిబస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. వైరస్ కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ తో ప్రజా రవాణా పూర్తిగా స్థంబించి పోయిన సంగతి తెలిసిందే. అయితే , ఆ తర్వాత కేంద్రం సడలింపులు ఇవ్వడం తో ..రాష్ట్రం లో ప్రజా రవాణా ప్రారంభమైంది.

అన్‌లాక్‌ 0.1 ప్రారంభమైన తర్వాత అంతర్రాష్ట్ర సర్వీసులలో 70 శాతం టికెట్‌ లు బుక్‌ అయినట్లు సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రోహిత్‌ శర్మ తెలిపారు. ఈ మహమ్మారి కంటే ముందు సాధారణ రోజుల్లో ఉన్న టికెట్‌ బుకింగ్‌ ల కంటే ఇది ఎక్కువేనని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లోని రోడ్డు రవాణా సంస్థలపై జరిపిన అధ్యయనం లో ఈ అంశం వెల్లడైనట్లు చెప్పారు.

6090 బస్సులతో 137 నగరాలకు, పట్టణాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రయాణ సదుపాయం కల్పిస్తోందన్నారు. మరో 1,445 ప్రైవేట్‌ బస్సులు కూడా ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నుంచి 596 ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు, వైజాగ్‌ నుంచి 383, నెల్లూరు నుంచి 226 అంతర్రాష్ట్ర  రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ‌లో 1218 బస్సులు 45 నగరాలకు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. 
Tags:    

Similar News