యోగీ ఇమేజ్ ఎంత‌లా పెరిగిందంటే!

Update: 2017-04-04 11:27 GMT
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఆదిత్య‌నాథ్ యోగీ ఒక్క యూపీలోనే కాకుండా యావ‌త్తు భార‌త దేశంలోనే వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. అప్ప‌టిదాకా బీజేపీ ఎంపీగా, హిందూ అతివాదిగా ముద్ర వేసుకున్న యోగీ... మొన్న‌టి యూపీ ఎల‌క్ష‌న్స్‌లో బీజేపీకి ఘ‌న విజ‌యం ద‌క్క‌డం, ఆ త‌ర్వాత చాలా మంది సీఎం పీఠం కోసం య‌త్నించినా... ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ... యోగీ అభ్య‌ర్థిత్వానికే మ‌ద్ద‌తివ్వడం అంద‌రి ఆశ్య‌ర్యానికి గురి చేశాయి. ఈ ఒక్క దెబ్బ‌తో యోగీకి సంబంధించిన ఏ చిన్న విష‌య‌మైనా... జాతీయ మీడియాతో పాటు ప్రాంతీయ మీడియాలోనూ ప‌తాక శీర్షిక‌ల‌కెక్కుతోంది.

ఇప్పుడు యోగీ ఇమేజ్ పీక్ స్థాయికి వెళ్లిపోయింద‌న‌డానికి ఇటీవ‌ల జ‌రిగిన ఓ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. గ‌త నెల 29న చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా వైర‌ల్‌ గా మారింద‌నే చెప్పాలి. వార‌ణాసిలో చోటుచేసుకున్న ఆ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... యోగీ వేషంలోనే కాషాయ దుస్తుల్లోకి మారిన ఓ వ్య‌క్తి.. యోగీ మాదిరే గ‌న్ మెన్ల‌ను వెంట‌బెట్టుకుని కారులో వ‌చ్చేశారు. చూడ్డానికి అచ్చూ యోగీలానే ఆ వ్య‌క్తి క‌నిపించ‌డం, వెంట గ‌న్‌ మెన్లు కూడా ఉండ‌టంతో అక్క‌డి జ‌నంతో పాటు పోలీసులు కూడా యోగీనే వ‌చ్చేశార‌ని భావించారు. ఇంకేముంది... అక్క‌డ ఒక్క‌సారిగా హ‌డావిడి మొద‌లైంది.

పోలీసులు భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయ‌గా... అక్క‌డి జ‌నం పూల‌తో వ‌చ్చిన ఆ వ్య‌క్తి కారుపై పూల వ‌ర్షం కురిపించారు. ఆ త‌ర్వాత కారు దిగిన ఆ వ్యక్తి తాను యోగీని కాద‌ని చెప్పేశార‌ట‌. దీంతో అవాక్కైన జ‌నం - పోలీసులు... యోగీ అంటే తామింత‌గా అభిమానిస్తున్నామా? అని త‌మ‌ను తాము ప్ర‌శ్నించుకున్నార‌ట‌. ఇక కాస్తంత ఆల‌స్యంగా మేల్కొన్న పోలీసులు... ఇలా సీఎం రూపంలో మారు వేషం వేసుకుని వ‌స్తే ఎలాగంటూ స‌ద‌రు వ్య‌క్తిని ప్ర‌శ్నించార‌ట‌. ఇలా మ‌రోమారు చేయోద్దంటూ కాస్తంత గ‌ట్టి వార్నింగు ఇవ్వ‌డ‌మే కాకుండా.. ఇలా వ‌స్తే.. ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతాయి క‌దా అంటూ ఆ వ్య‌క్తికి జ్ఞానోద‌య‌మ‌య్యేలా చెప్పి పంపించార‌ట‌.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News