తప్పు చేసిన వారిని జైలుకు పంపటం మామూలే. అది.. మనుషులకు? మరి.. మృగాలకు? వాటిని కూడా జైలుకు తీసుకెళ్లి పెట్టేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ జంతువుల్ని జైల్లో పెట్టేంత తప్పు అవేం చేశాయంటే.. అధికారులు చెప్పే మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే.
ఇంతకీ.. ఈ చిత్రమైన ఘటన ఎక్కడ జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ లోని జలన్ జిల్లా ఉరై ప్రాంతంలో చోటు చేసుకుంది. గాడిదలు తప్పు చేశాయంటూ ఎనిమిది గాడిదల సమూహాన్ని జైల్లో పడేశారు. ఇంతకీ.. అంత మహాపరాధం ఏం చేశాయని ఆరా తీస్తే షాక్ తినాల్సిందే. జైలు కాంపౌండ్ లో ఉన్న ఖరీదైన మొక్కల్ని నాశనం చేయటమే ఈ గాడిదలు చేసిన తప్పుగా చెబుతున్నారు.
జైలు ఆవరణలో తమ సీనియర్ అధికారులు ఖరీదైన మొక్కల్ని నాటితే.. గాడిదలేమో ఆ మొక్కల్ని బిర్యానీ తిన్నంత హాయిగా తినిపారేశాయట. గాడిదలు తిన్న మొక్కలు విలువ లక్షల్లో ఉన్నాయట. గతంలో ఇలాంటి పనే చేస్తే.. గాడిదల యజమానికి వార్నింగ్ ఇచ్చారట. అయినా గాడిదలు తమ పాటికి తాము వచ్చేసి మొక్కలు తినేస్తున్న వైనంతో జైలు అధికారులకు ఆగ్రహం వచ్చింది.
అంతే.. మొక్కల్ని తినటానికి వచ్చిన ఎనిమిది గాడిదల్ని పట్టుకొని జైలుకు తరలించారు. వాటిని ఎంతకూ వదల్లేదు. దీంతో.. వాటి యజమాని వచ్చి తమ గాడిదల్ని విడుదల చేయాలని కోరారు. అధికారులు ససేమిరా అనటంతో బెయిల్ తెచ్చుకొని మరీ రిలీజ్ చేయించుకున్నారట. బెయిల్ కోసం ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. గాడిదలకు సరైన ఆహారం పెడితే అవి ఊరు మీద పడవు కదా.. నోరు లేని జీవాల్ని జైల్లో పెట్టే కన్నా.. వాటిని తీరుకు సదరు యజమానికి శిక్ష విధిస్తే సరిపోయేది. కానీ.. యజమాని కంటే గాడిదల మీద అధికారులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.