ఆయన టీడీపీ అధికారంలో ఉన్నపుడు జిల్లాలోనే కాదు రాష్ట్రలోనే బిగ్ సౌండ్ చేసే లీడర్లలో ఒకరిగా ఉండేవారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓడగానే గంటా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇపుడు మళ్ళీ ఆయన టీడీపీలో యాక్టివ్ అయ్యారు. ఈ మధ్యలో ఆయన మీద వచ్చిన ప్రచారం చాలానే ఉంది. వైసీపీ, బీజేపీ, జనసేనలలోకి వెళ్ళిపోతారు అంటూ వచ్చిన గాసిప్స్ తో అధినాయకత్వం అనుమానాలు పెంచుకుంది.
ఇపుడు గంటా టీడీపీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుంది, సీఎం అయ్యేది చంద్రబాబే అని ఎంతగా చెబుతున్నా అధినాయకత్వం మాత్రం పూర్వం మాదిరిగా ఆయనను దగ్గరకు చేరనివ్వడంలేదా అన్న చర్చ అయితే సాగుతోంది.
తాజాగా ఒంగోలులో జరిగిన మహానాడులో గంటా మార్క్ సౌండ్ ఏదీ అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మహానాడులో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఒక రేంజిలో ప్రసంగం చేశారు. ఆయన వైసీపీ మీద వీర లెవెల్ లో విరుచుకుపడ్డారు. అయ్యన్న స్పీచ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది కూడా.
మరి ఆయన సమకాలీకుడు, అదే జిల్లాకు చెందిన గంటా హడావుడి మహానాడులో ఎందుకు లేదు అన్నదే అంతటా చర్చగా ఉందిపుడు. గంటా టీడీపీతోనే తన పయనం అనుకుని ఒక నిర్ణయానికి వచ్చి మరీ జోరు పెంచారు. అంగబలం, అర్ధబలం పూర్తిగా ఉన్న ఈ మాజీ మంత్రి టీడీపీలో ఇపుడు కీలకంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది.
కానీ ఎందుకో ఆయన హవా పూర్వం మాదిరిగా చూపించలేకపోతున్నారా అన్నదే అనుచరులలోనూ కలుగుతున్న సందేహమట. ఏది ఏమైనా టీడీపీలో చాలా మార్పులు వచ్చేశాయి. చంద్రబాబు మొహమాటానికైనా నాయకులను మళ్ళీ చేరదీసేవారు. కానీ ఇపుడు చినబాబు జమానాగా ఉంది. ఆయన ఇలాంటి వాటికి నో చెప్పేస్తున్నారు.
పైగా ఆయన అయ్యన్నపాత్రుడిని దగ్గరకు తీస్తున్నారు అని అంటారు. అయ్యన్నకు గంటాకు మధ్య రాజకీయ వైరం ఉందని కూడా ప్రచారంలో ఉంది. దాంతోనే అన్ని బలాలూ ఉన్నా గంటా మహానాడులో నో సౌండ్ అన్నట్లుగా గమ్మున ఉండిపోయారా అని చర్చించుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే గంటా రాజకీయ చతురుడు. ఆయన ఇప్పటికే జై లోకేష్ అని అనేశారు.
దాంతో ఆయన కూడా రానున్న కాలానికి తగినట్లుగా గేర్ మారుస్తారని, మళ్ళీ పూర్వం మాదిరిగా తన సత్తాను చాటుతారని అనుచరులు ధీమాతో ఉన్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మహానాడులో గంటా వంటి సీనియర్ సందడి పెద్దగా లేకపోవడం మాత్రం ఒక వెలితి అని అనుచరులు అనుకుంటే తప్పు లేదుగా.