బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు

Update: 2022-06-11 06:51 GMT
వచ్చే నెలలో జరగబోతున్న రాష్ట్రపతి ఎన్నికలనే బలప్రదర్శనకు వేదికగా తీసుకోవాలని రాజకీయ పార్టీలు, పక్షాలు డిసైడ్ చేసుకున్నట్లున్నాయి. ఇందులో భాగంగా ఎవరి వంతు ప్రయత్నాలను వాళ్ళు మొదలు పెట్టేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తరపున నరేంద్ర మోడీ ఎవరిని అభ్యర్ధిగా ఎంపిక చేయబోతున్నారనేది సస్పెన్సుగా మారింది. ఇదే సమయంలో బలమైన అభ్యర్ధిని పోటీగా దించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఎన్డీయే-యూపీయే బలాలను భేరీజు వేసినపుడు ఎన్డీయే బలమే ఎక్కువ. కాబట్టి యూపీఏ తరపున అభ్యర్ధిని నిలబెట్టినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఇదే సమయంలో నాన్ ఎన్డీయే పార్టీలను గనుక యూపీఏ కలుపుకుని వెళ్ళగలిగితే ఎన్డీయేకన్నా యూపీఏ బలం పెరిగిపోతుంది.

అయితే నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలంటే చాలా తక్కువనే చెప్పాలి. ఇలాంటి పార్టీల్లో కీలకమైనవి తృణమూల్ కాంగ్రెస్, వైసీపీ, బీజూ జనతాదళ్, టీఆర్ఎస్. అయితే బీజూ అధినేత నవీన్ పట్నాయక్ మనసులో ఏముందో తెలీదు.

ఇక టీఆర్ఎస్ అధినేత కేసీయార్ మోడీకి పూర్తిగా వ్యతిరేకం. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్డీయేకే మద్దతు పలికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఆ మద్దతు అభ్యర్థి పైన ఆధారపడుంటుంది. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ తరపున సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగారు. ఇప్పటికే యూపీఏ పక్షాలతో పాటు నాన్ యూపీఏ పక్షాలతో ఖర్గే చర్చలు మొదలుపెట్టారు. మమతా బెనర్జీ, స్టాలిన్, ఆప్ నేత సంజయ్ సింగ్, సీపీఐకి చెందిన బినోయ్ విశ్వం, శరద్ పవార్, శివసేన నేతలతో కూడా మాట్లాడారు.

క్షేత్రస్థాయి పరిస్ధితులను చూస్తే మమతాబెనర్జీ యూపీఏ అభ్యర్ధికే మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. కాకపోతే అభ్యర్ధిని ఏకాభిప్రాయంతోనే నిర్ణయించాలని చెప్పారు. నిజానికి మనదగ్గర ఏకాభిప్రాయం ఎప్పటికీ సాద్యంకాదు. మెజారిటి అభిప్రాయాన్నే ఏకాభిప్రాయంగా చెప్పుకోవాలంతే.

మరిదీనికి మమత అంగీకరిస్తారో లేదో తెలీదు. తొందరలోనే యూపీఏ, నాన్ యూపీఏ పార్టీలతో ఖర్గే సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్డీయే, యూపీఏ తరపున రంగంలోకి దిగబోయే అభ్యర్ధులు ఎవరన్నదే ఇపుడు ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News