ట్విటర్ బాటలో మెటా: భారీ ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం

Update: 2022-11-08 01:30 GMT
ట్విటర్ బాటలో మెటా నడుస్తోంది. ట్విట్టర్‌లో భారీ తొలగింపుల తర్వాత మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థ ఈ వారం 'వేల మంది' ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. మరొక బిగ్ టెక్ కంపెనీ ఉద్యోగులను ఉన్నఫలంగా రోడ్డున పడేసేందుకు సిద్ధమైంది.

అమెరికా మీడియా కథనాల ప్రకారం.. బుధవారం నుండి ప్రారంభం కానున్న "పెద్ద-స్థాయి" ఉద్యోగ కోతలు.. ఆ తర్వాత "వేలాది" మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ఇతర సిబ్బంది తొలగింపులు ఉండనున్నాయని తెలిపారు.  

ప్రపంచంలోని టాప్ 3  సోషల్-మీడియాలు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లను కలిగిన కంపెనీ 'మెటా' ప్రణాళికాబద్ధమైన కోతలు చేపడుతోంది. ఇది దాని శ్రామిక శక్తిని అనేక వేల మందిని ప్రభావితం చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రణాళికాబద్ధమైన తొలగింపులు కంపెనీ 18 సంవత్సరాల చరిత్రలో ఇదే ప్రథమం. మొదటి హెడ్-కౌంట్ తగ్గింపుగా చెప్పవచ్చు అని అక్కడి మీడియా తెలిపింది.

ఫేస్ బుక్ మరియు ఇన్ స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా  87,000 మంది ఉద్యోగులను తొలగించడానికి రెడీ అయినట్టు సమాచారం. ఈ సెప్టెంబర్ నాటికే జాబితా రెడీ చేసింది. ఇంత మందిని ఇంటికి పంపడానికి రంగం సిద్ధం చేసింది..

కంపెనీ తక్కువ సంఖ్యలో అధిక ప్రాధాన్యత కలిగిన వృద్ధి రంగాలపై మా పెట్టుబడులను కేంద్రీకరిస్తుందని జుకర్‌బర్గ్ ఇటీవల ప్రకటించారు.  జూన్‌లో మెటా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్ ఇప్పటికే ఉద్యోగులకు ఈ మేరకు హెచ్చరికలు పంపారు.  సరిగ్గా పనిచేయలేని వారికి వేటు తప్పదని స్పష్టం చేశారు.

గత నెలలో కంపెనీ ఆదాయాలపై సమీక్ష సందర్భంగా జుకర్‌బర్గ్ మాట్లాడారు. "2023లో మేము మా పెట్టుబడులను తక్కువ సంఖ్యలో అధిక ప్రాధాన్యత గల వృద్ధి రంగాలపై కేంద్రీకరించబోతున్నాం." అని ప్రకటించారు.  కాబట్టి కొన్ని టీంలు అర్థవంతంగా పెరుగుతాయి, కానీ చాలా ఇతర జట్లు వచ్చే ఏడాది తగ్గించబడుతాయి లేదా తొలగించబడుతాయి. మొత్తంగా మేము 2023ని దాదాపు అదే పరిమాణంలో ఈనాటి కంటే కొంచెం చిన్న సంస్థగా ముగించాలని భావిస్తున్నామని  జుకర్ బర్గ్ పేర్కొన్నాడు.

మెటా మరో త్రైమాసికంలో రాబడిలో క్షీణతను నమోదు చేసింది. పెట్టుబడిదారులు దాని నష్టాన్ని కలిగించే బిలియన్-డాలర్ల మెటావర్స్ కలపై విశ్వాసం కోల్పోవడం ప్రారంభించారు. మెటా ఆదాయం సంవత్సరానికి 4 శాతం క్షీణించి $27.7 బిలియన్లకు చేరుకుంది. మెటా  వర్చువల్ రియాలిటీ విభాగమైన రియాలిటీ ల్యాబ్స్‌లో భారీ నష్టాల కారణంగా ఈ క్షీణత ఏర్పడింది. ఇది ఈ త్రైమాసికంలో $3.672 బిలియన్లను కోల్పోయింది.

మెటా ఇన్వెస్టర్లు కంపెనీ తమ ఉద్యోగులను కనీసం 20 శాతం తగ్గించుకోవాలని, మెటావర్స్‌లో పెట్టుబడులు పెట్టడం మానేయాలని పిలుపునిచ్చారు. ఈమేరకు జుకర్ బర్గ్ మెటాలోని ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News