కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోనూ సాగనుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ఖరారైంది. హైదరాబాద్ నగర నడిబొడ్డు నుంచే.. ఈ యాత్ర సాగేట్లు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 7 పార్లమెంట్, 17 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 375 కిలోమీటర్ల మేర 14 రోజుల పాటు రాహుల్ జోడో యాత్ర సాగనుంది.
కన్యాకుమారిలో గత నెల 7న రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర మొదలైంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో పూర్తి చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఈ జోడో యాత్ర ప్రవేశించాల్సి ఉంది. ఏఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న కర్ణాటక నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి జోడో యాత్ర ప్రవేశిస్తుంది. రాహుల్ గాంధీతో పాటు కశ్మీర్ వరకు పాదయాత్ర చేసే దాదాపు 300 మంది బస చేయడానికి అవసరమైన 20 కంటైనర్లు వారి వెంట వస్తున్నాయి.
భారత్ జోడో యాత్ర శంషాబాద్ నుంచి హైదరాబాద్ నగరానికి ఏ మాత్రం సంబంధం లేకుండా వెళ్లేట్లు రూట్ ఉండగా.. దానిపై పలుమార్లు కాంగ్రెస్ నాయకులు సమావేశమై చర్చించారు. ఆ రూట్‌ను హైదరాబాద్ నగరం నుంచి తీసుకెళ్లడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్న అంచనాకు వచ్చారు.
నాయకుల అభిప్రాయం మేరకు రూట్ మ్యాప్ సిద్ధం చేసి ఏఐసీసీకి నివేదించారు. దీనిని పరిశీలించిన తర్వాత పీసీసీ ఇచ్చిన రూట్ మ్యాప్‌నకు ఆమోదం లభించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరాబాద్ నడిబొడ్డు మీదుగా కొనసాగనుండటంతో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాదయాత్ర నిర్వహణ ఉండాలని పీసీసీ భావిస్తోంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు పీసీసీ సీనియర్ నాయకులు పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ నెల 24న కర్ణాటక నుంచి మహబూబ్నగర్ జిల్లా మక్తల్ వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించనుంది.
అక్కడ నుంచి మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, శంషాబాద్, ఆరంఘర్, చార్మినార్, ఎంజే మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి దర్గా, విజయనగర్ కాలనీ, మాసబ్‌ట్యాంక్, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట.. అమీర్పేట, కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెరు, ముత్తంగి, సంగారెడ్డి ఎక్స్ రోడ్డు, జోగిపేట, శంకరంపేట్, మదనూర్‌ల మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 14 రోజులు.. 375 కిలోమీటర్లు కొనసాగనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.