టి20 ప్రపంచ కప్ మధ్య దశకు చేరుకుంది. సూపర్ 12లో మ్యాచ్ లు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. అయితే, వరుణుడు, అనూహ్య ఫలితాలతో సెమీఫైనల్స్ కు చేరేదెవరో ఇప్పటికీ స్పష్టత రాలేదు. చిత్రమేమంటే.. సూపర్ 12 రెండు గ్రూపులు 1, 2లో ఏ జట్టుకూ ఇంకా సెమీ ఫైనల్స్ తలుపులు పూర్తిగా తెరుచుకోకపోవడం.. బుధవారం బంగ్లాదేశ్ పై గెలుపుతో టీమిండియా అవకాశాలు మెరుగవగా.. మంగళవారం న్యూజిలాండ్ పై విజయంతో ఇంగ్లండ్ రేసులో నిలిచింది. అంతకుముందు భారత్.. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో, ఐర్లాండ్ పై ఇంగ్లండ్ ఓటమితో ఈ రెండు జట్లకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.
గ్రూప్ 1 ఎలా ఉందంటే..
ఈ గ్రూపులో డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య ఆస్ట్రేలియా, డాషింగ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక అన్నిటికీ అవకాశాలు కనిపిస్తున్నాయి. నెదర్లాండ్స్, జింబాబ్వే ఔటయ్యాయి. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా 5 పాయింట్లతో ఉన్నాయి. శ్రీలంకకు 4 పాయింట్లున్నాయి. ఈ జట్లన్నీ తలా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే, కివీస్ ముందంజలో ఉంది. తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై 200 కొట్టడం, ఓడినవాటిలోనూ మంచి స్కోర్లు చేయడం రన్ రేట్ పరంగా న్యూజిలాండ్ కు కలిసొచ్చింది. విలియమ్సన్ సేన ఐర్లాండ్ తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే నేరుగా సెమీస్ కు వెళ్తుంది. అయితే, ఓడినా ఓకే. కానీ.. అప్పుడు ఆస్ట్రేలియా.. అఫ్గానిస్థాన్ పై ఓడాలి. కంగారూలకు కాస్త క్లిష్ట పరిస్థితే. అఫ్గాన్ మీద భారీ స్థాయిలో గెలవడంతో పాటు రన్ రేట్ పరంగానూ మెరగవ్వాలి. పేలవ రన్‌రేట్ కారణంగా ఇప్పటికైతే సెమీస్‌కు గ్యారెంటీ లేదు.
ఆసీస్ అఫ్గాన్ పై, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ కూడా తమ చివరి మ్యాచ్‌ల్లో అందరికీ ఏడు పాయింట్లే ఉంటాయి. కానీ ఇంగ్లండ్, న్యూజిలాండ్ కు మంచి రన్ రేట్ ఉంది. ఇక్కడ ట్రిక్ ఏమిటంటే.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లలో రెండు జట్లలో ఏదో ఒకటి చివరి మ్యాచ్ లో ఓడితే.. ఆసీస్‌కు సాధారణ విజయం సరిపోతుంది. ఇక ఇంగ్లండ్ శ్రీలంకతో ఆడాల్సి ఉంది. అందులో గెలిస్తే సెమీస్ చేరినట్లే. ఈ గ్రూపులో ఈ రెండిండిటే చివరి మ్యాచ్. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు తమ మ్యాచ్ ల్లో గెలిస్తే.. సెమీస్ చేరాలంటే ఏం చేయాలో ఇంగ్లండ్ కు తెలిసిపోతుంది. కాగా, ఆసీస్, కివీస్ లలో ఒకటి ఓడిపోయి ఉంటే.. రన్‌రేట్‌తో సంబంధం లేకుండా ఇంగ్లాండ్‌కు గెలుపు చాలు. అయితే, ఇంగ్లాండ్ ఓడినా ముందంజ వేయడానికి స్వల్ప అవకాశాలు ఉంటాయి. అందుకు చాలా సమీకరణాలు కలిసిరావాలి. ఇక ఇంగ్లాండ్ మీద ఓడిపోతే శ్రీలంక ఇంటికెళ్తుంది. గెలిస్తే రేసులో ఉంటుంది. అయితే ఇది సాకారం కావాలంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో ఒకటి ఓడిపోవాలి.
భారత్ ఉన్న గ్రూప్ 2 తీరిది..
ఈ గ్రూప్ లో భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, జింబాబ్వే ఉన్నాయి. మన జట్టు ఐదు మ్యాచ్ లలో నాలుగు ఆడేసింది. ఒకదాంట్లోనే ఓడింది. ఆదివారం చివరి మ్యాచ్ జింబాబ్వేతో ఆడుతుంది. గెలిస్తే నేరుగా సెమీస్ చేరుతుంది. ఓడిపోతే.. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ మ్యాచ్ ల ఫలితంపై భవితవ్వం ఆధారపడి ఉంటుంది. ఈ గ్రూప్ లో భారత్-జింబాబ్వే మ్యాచ్ చివరిది. ఇక దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో ఉంది. ఒక మ్యాచ్ వర్షంతో రద్దవడం వీరికి ప్రతికూలంగా మారింది. కానీ, గ్రూప్ నుంచి సెమీస్ అవకాశాలు ఎక్కువగా ఉన్నది సఫారీలకే. తన రెండు మ్యాచుల్లో పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో తలపడాల్సి ఉంది. ఒక్కదాంట్లో గెలిచినా ఏడు పాయింట్లతో సెమీస్ కు చేరుతుంది. ఓడితే ఇతర జట్లపై ఆధారపడాల్సిన అవస్థ ఎదురవుతుంది. బంగ్లాదేశ్ కు ప్రస్తుతం 4 పాయింట్లున్నాయి.
రెండు మ్యాచ్ లలో ఓడిన ఈ జట్టు.. చివరగా పాకిస్థాన్‌తో ఆడనుంది. అందులో గెలిస్తే సెమీస్ అవకాశాలు ఉంటాయి. అది కూడా ఇతర జట్ల ఫలితంపై మీద ఉంటుంది. గ్రూప్ లో చాన్సులు తక్కువగా ఉన్నది పాకిస్థాన్‌కు. మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓటమితో రెండే పాయింట్లతో ఉంది. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో ఆడాల్సి ఉంది. వీటిలో గెలిచినా ఆరు పాయింట్లే అవుతాయి. దక్షిణాఫ్రికా పాక్‌పైనే కాకుండా.. నెదర్లాండ్స్ చేతిలోనూ ఓడితేనే బాబర్ సైన్యానికి సెమీస్ బెర్తు అవకాశం ఉంది. గురువారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో ఓడితే వేరే ఆలోచన లేకుండా ఇంటికెళ్తుంది. జింబాబ్వే (3), నెదర్లాండ్స్ (2) పాయింట్లతో ఉన్నాయి. జింబాబ్వే.. భారత్‌తో, నెదర్లాండ్స్ తమ చివరి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో ఆడతాయి. వీటికి సెమీస్ అవకాశాలు లేనేలేవు. కానీ, ప్రత్యర్థి జట్ల అవకాశాలను దెబ్బతీస్తాయి.
వరుణుడు బ్యాటింగ్ కు దిగకుంటేనే...
పైన చెప్పుకొన్న సమీకరణాలు మ్యాచ్ లు సజావుగా సాగితేనే. అయితే, ఈ టోర్నీలో వరుణుడు కూడా ఆడుతున్నాడు. వర్షాలు పడి మ్యాచ్‌లు రద్దయితే ముఖ్యంగా గ్రూప్-1లో సమీకరణాలు మారిపోతాయి. గ్రూప్ 2 లో మాత్రం ఈ పరిస్థితి కాస్త తక్కువ. కానీ, దేన్నీ కొట్టిపారేయలేం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.