రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ నాయకులు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. ఆయా పార్టీల్లోని అభ్యర్థులు ఎవరనే విషయంపై చర్చలు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం కొత్త పార్టీ ప్రకటించిన సినీ నటుడు ఉపేంద్ర వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నాడు. కర్ణాటక రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ) తరుపున అభ్యర్థులను దింపుతామని ఆ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా మరో సినీ నటడు ప్రకాశ్‌రాలు బెంగుళూర్ సెంట్రల్ నుంచి పోటీ చేస్తానని ఇదివరకే ప్రకటించారు. బీజేపీని విమర్శిస్తున్న ఆయన ఏ పార్టీ తరుపున వెళ్లనని - ఇండిపెండెంట్ గానే బరిలోకి దిగుతానని చెప్పాడు. ఈ తరుణంలో ప్రకాశ్‌రాజ్ యూపీపీ తరుపున వస్తాడా..? అని ఉపేంద్రను కొందరు అడిగారు.
దీనిపై ఉపేంద్ర మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చే ఏ అభ్యర్థినైనా స్వాగతిస్తామన్నారు. తమ పార్టీలో ఒకే రకమైన నియమాలు ఉంటాయని - చక్కని మెనిఫెస్టోతో వస్తే ప్రకాశ్ రాజ్ కు మద్దతిస్తామన్నారు. తమ పార్టీ రాజకీయాలు చేయదని - కేవలం ప్రజా శ్రేయస్సు కోసమే ఆలోచిస్తుందని ఉపేంద్ర తెలిపారు.
ఇక తమ పార్టీలో ఎవరైనా అసంబద్ధ హామీలు ఇస్తే ఊరుకునేది లేదన్నారు. పక్కా ప్రణాళికతో ముందుకు రావాలని, అప్పుడే అభ్యర్థులకు తమ పార్టీలో అవకాశం ఉంటుందని తెలిపారు. అభ్యర్థి ఎవరనే విషయంలో ఎంపిక, ఎన్నికల లాంటివి కాకుండా ప్రజా నాయకుడు అని తెలిస్తే ఎలాంటి పైరవీలు లేకుండా టికెట్ ఇస్తామన్నారు.