దిశ హంతకుల ఎన్ కౌంటర్ మీద అనేక మంది ప్రముఖులు స్పందించిన సంగతి తెలిసిందే. దిశ పై జరిగిన అఘాయిత్యం మీదే ముందుగా కొందరు రియాక్ట్ అయ్యారు. ఆమెపై ఘాతుకానికి పాల్పడిన వారు ఎన్ కౌంటర్ అయ్యాకా మరి కొందరు స్పందించారు.
అలా స్పందించిన వారి లో కన్నడ హీరో ఉపేంద్ర కూడా ఒకరు. ఆయన ఎన్ కౌంటర్లను ఖండించారు. దిశపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. ఎన్ కౌంటర్లకు బదులు గా వేగిరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది అన్నట్టుగా ఉపేంద్ర అభిప్రాయ పడ్డారు.
అయితే ఉపేంద్ర ట్వీట్లు అడ్డం తిరిగాయి. దిశపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని జనసామాన్యం సమర్థిస్తూ ఉంది. కొన్ని నేరాల విషయంలో అయినా తక్షణ న్యాయం జరిగితే.. ఆ తర్వాత అలాంటి పనులు చేయాలనుకునే వాళ్లకు భయం పుడుతుందని సామాన్యులు అనుకుంటున్నారు.
ఆ అభిప్రాయంతో ఉన్న వాళ్లు ట్విటర్లో ఉపేంద్ర పై విరుచుకు పడుతూ ఉన్నారు. ఎన్ కౌంటర్ లను వ్యతిరేకించడం పట్ల ఆ హీరోని విమర్శిస్తూ ఉన్నారు. దీంతో ఉపేంద్ర మళ్లీ వివరణ ఇచ్చుకున్నాడు. తన మాటలను తప్పు గా అర్థం చేసుకోవద్దని, తనకూ ఆడ పిల్లలు ఉన్నారని.. అఘాయిత్యానికి పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని మాత్రమే తను అన్నట్టుగా ఉపేంద్ర వివరణ ఇచ్చుకుంటున్నాడు. వారిని శిక్షించాల్సిందే కానీ, ఎన్ కౌంటర్ చేయాల్సింది కాదని ఉపేంద్ర అంటున్నాడు.