సివిల్స్ లో మనోళ్లు అదరగొట్టేశారు.. 20 ర్యాంకర్ శ్రీజ సో స్పెషల్

Update: 2021-09-25 03:35 GMT
దేశంలోనే అత్యుత్తమ సర్వీసుగా చెప్పే సివిల్ సర్వీసెస్ తాజా ఫలితాల్నియూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా వెల్లడించింది. ఈసారి ఫలితాల ప్రత్యేకత ఏమంటే.. తెలుగు వారు తమ సత్తాను చాటారు. టాప్ 100లో ఏకంగా డజన్ మంది తెలుగు వారు ఉండటం ఒక ఎత్తు అయితే.. మొత్తంగా యాభై మంది వరకు మంచి ర్యాంకులు రావటం మామూలు విషయం కాదనే చెప్పాలి. సివిల్ సర్వీసెస్ 2020 తుది ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ర్యాంకు ఆధారంగా ఐఏఎస్.. ఐపీఎస్.. ఐఎఫ్ఎస్.. ఐఆర్ఎస్.. లాంటి వాటిల్లో ఎవరికి తగ్గట్లు వారికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ ఎంపిక పూర్తి అయిన తర్వాత ఏడాది పాటు శిక్షణ ఇచ్చి.. అనంతరం వారికి పోస్టింగులు ఇస్తారన్న సంగతి తెలిసిందే.

ఈసారి విజేతల్లో మన తెలుగమ్మాయి శ్రీజ 20 ర్యాంకును సాధించి అదరగొట్టింది. శ్రీజ స్పెషల్ ఏమంటే.. మొదటి అటెంప్టులోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఇది మామూలు విషయం కాదు. ఇంత మంచి ర్యాంకు రావాలంటే కనీసం ఒకట్రెండుసార్లు అటెంప్టు చేసి ఉండాలి. అలాంటిదేమీ లేకుండా.. మొదటిసారే ఇంత మంచి ర్యాంకును సొంతం చేసుకోవటం గొప్ప విషయంగా చెప్పాలి. డాక్టర్ అయిన శ్రీజ స్వస్థలం వరంగల్ కాగా.. హైదరాబాద్ లోని ఉప్పల్ సమీపంలోని సాయినగర్ లో ఆమె కుటుంబం ఉంటోంది. తండ్రి శ్రీనివాస్ హబ్సిగూడలోని వాహనాల షోరూంలో సేల్స్ మేనేజర్ గా పని చేస్తుంటే.. తల్లి శ్రీలత నర్సుగా పని చేస్తున్నారు.

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన శ్రీజ.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ ను క్రాక్ చేయటం.. ఏకంగా 20 ర్యాంకులో నిలవటం సో స్పెషల్ గా చెప్పాలి. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా.. మనసుకు నచ్చిన పని చేస్తూ ప్రిపేర్ అయ్యానని చెబుతోంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎంబీబీఎస్ చేశానని.. పేదలకు మరింత సేవ చేయాలన్న ఆలోచనతో సివిల్స్ కు సిద్ధమైనట్లుగా పేర్కొంది. ఆడుతూ పాడుతూనే ప్రిపేర్ అయినట్లు చెప్పిన ఆమె.. అనని అంశాల మీద అవగాహన పెంచుకోవటం వల్లే ఎక్కడా ఎలాంటి తడబాటుకు గురి కాలేదన్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. టాప్ 100లో నిలిచిన ర్యాంకర్లరో పన్నెండు మంది తెలుగు వారైతే.. వారిలో అత్యధికం అమ్మాయిలే కావటం మరో విశేషంగా చెప్పాలి. విజేతల్లో ఎక్కువ మంది మధ్యతరగతి.. సామాన్య జీవితాలే కావటం విశేషం. కష్టపడి చదవి.. తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనుకున్న పట్టుదల ఎక్కువగా ఉన్న వారే విజేతలుగా నిలిచారని చెప్పాలి.

మరో విజేత రిచా కులకర్ణి కూడా మొదటి ప్రయత్నంలోనే 134వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఆమె కూడా హైదరాబాద్ లోని తార్నాకలో ఉంటారు. 207వ ర్యాంకు సాధించిన సంజనా సింహ.. హైదరాబాద్ లోని మలక్ పేటకు చెందిన వారు. కలెక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు. రైతుల ఆత్మహత్యల్ని కట్టడి చేయాలన్న కలే తనను సివిల్స్ సాధించేలా చేసిందని చెప్పారు. 66వ ర్యాంకు సాధించిన అనిష శ్రీవాస్తవ సికింద్రాబాద్ లోని ఆర్కేపురం. కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసి సివిల్స్ కు ఎంపికయ్యారు.

248వ ర్యాంకు సాధించిన శోభిక పాఠక్ కూడా సికింద్రాబాద్ లోని తిరుమల గిరి. బెంగళూరులోని ఒక ప్రైవేటు సంస్థలో జాబ్ చేస్తున్న శోభిక సివిల్స్ కలను సొంతం చేసుకన్నారు. విజయవాడకు చెందిన చంద్రకాంత్ రెడ్డి 120వ ర్యాంకు సాధించారు. కరోనా నేపథ్యంలోక్లాసుల్ని నేరుగా వినలేకపోయినా.. సొంతంగా నోట్స్ తయారు చేసుకోవటం ద్వారా ప్రిపేర్ అయినట్లు చెప్పాడు. ఈసారి సివిల్స్ సాధించిన తెలుగువారిలో ఎక్కువ మంది తెలంగాణలో నివసిస్తున్న వారు కావటం గమనార్హం.

టాప్ 100లోపు ర్యాంకులు సాధించిన వారిని చూస్తే..

ర్యాంకర్ పేరు                సాధించిన ర్యాంకు

-  పి. శ్రీజ                               20
- మైత్రేయి నాయుడు               27
- మేఘ స్వరూప్                     31
- జగత్ సాయి                         32
- సాయి మానస                       48
- అనిష శ్రీవాత్సవ                     66
- మౌనిక                                  75
- రాహుల్ దేవ్                          76
- మేఘన                                 83
- రవికుమార్                           84
- యశ్వంత్ కుమార్ రెడ్డి           93
- ప్రసన్నకుమార్                     100
Tags:    

Similar News