కేంద్ర మంత్రి వర్గం విషయంలో భారతీయ జనతా పార్టీ తమకు ఇచ్చిన ఝలక్ కు ప్రతీకారం తీర్చుకుంటున్నాడు జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. లోక్ సభ సార్వత్రి ఎన్నికల్లో బీజేపీతో కలిసి బిహార్ లో పోటీ చేసిన జేడీయూ కేంద్రమంత్రి వర్గంలో మూడు స్థానాలను ఆశించింది. జేడీయూ ఎంపీలు ముగ్గురికి కేంద్రమంత్రి పదవులు ఇవ్వాలని జేడీయూ కోరింది. ఈ మేరకు అమిత్ షాకు నితీశ్ కుమార్ విన్నవించారట.
అయితే కేంద్ర కేబినెట్ ఏర్పాటు విషయంలో జేడీయూను బీజేపీ పట్టించుకోలేదు. అలాగని పూర్తిగా పట్టించుకోనట్టుగా ఉండకుండా కేవలం ఒక బెర్త్ ను ఆఫర్ చేసింది. ఒక ఎంపీకి మాత్రమే కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని.. ఆ పదవి ఎవరికి ఇవ్వాలో చెప్పాలంటూ నితీశ్ కుమార్ కు బీజేపీ వాళ్లు సమాచారం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా నితీశ్ కుమార్ అసహనభరితుడు అయినట్టుగా తెలుస్తోంది.
మరీ ఒక్క మంత్రి పదవికి తమను పరిమితం చేయడం ఏమిటని..తమకు ఇస్తే మూడు మంత్రి పదవులు ఇవ్వాలని లేకపోతే ఏవీ వద్దని ఆయన తేల్చి చెప్పారు. ఆఖరికి కేంద్ర కేబినెట్లోకి జేడీయూ చేరనే లేదు. తమకు ఏ మంత్రి పదవీ వద్దని నితీశ్ స్పష్టంచేశారు.
తాము ఎన్డీయేలో ఉన్నట్టుగా.. అయితే మంత్రి పదవి మాత్రం వద్దని ఆయన తేల్చి చెప్పాడు. అంతే కాదు ఇప్పుడు ఒక ప్రతీకార చర్యకు కూడా దిగారాయన. తమ రాష్ట్రంలో కేబినెట్ విస్తరణకు దిగిన నితీశ్ కుమార్ ఎనిమిది మంది జేడీయూ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చి బీజేపీకి ఒక్క మంత్రి పదవిని మాత్రమే ఆఫర్ చేశారట.
బిహార్ లో నితీశ్ సర్కారులో బీజేపీ భాగస్వామిగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఎనిమిది మంది తమ పార్టీ వారిని మంత్రి వర్గంలోకి తీసుకున్న నితీశ్ బీజేపీకి మాత్రం కేవలం ఒక్క మంత్రి పదవిని మాత్రమే ఆఫర్ చేసి.. టిట్ ఫర్ ట్యాట్ అనిపించాడు!