ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాను వణికించిన టెర్రరిస్ట్ గా ఒసామా బిన్ లాడెన్ ను చెప్పక తప్పదు. అమెరికా మీదున్న ఆగ్రహంతో లాడెన్ జరిపిన విధ్వంసం.. దాడుల్ని గుర్తు తెచ్చుకుంటే అమెరికన్లు నేటికి వణికిపోయే పరిస్థితి. వందలాది మంది ప్రాణాలు తీసిన లాడెన్ ను వెతికి వెతికి మరీ.. చంపేసే వరకూ నిద్రపోని అగ్రరాజ్యం తాజాగా మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
ఒబామా కుమారుడు హంజాబిన్ లాడెన్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా అమెరికా తాజాగా ప్రకటించింది. 20ఏళ్ల వయసున్న హంజాబిన్ లాడెన్ పై సెక్షన్ 1 కింద అగ్రరాజ్యం ఆంక్షల్ని విధించటం గమనార్హం. తాజా ప్రకటనతో జూనియర్ లాడెన్ తో సంబంధాలు.. లావాదేవీలు జరపడాన్ని నిషేధించారు. హంజా బిన్ లాడెన్ అల్ ఖైదా అధికారిక సభ్యుడంటూ 2015 ఆగస్టు 14న అల్ ఖైదా సీనియర్ నేత అయిన అల్ జవహరి ప్రకటించారు. జూనియర్ లాడెన్ కూడా ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని.. అందుకే అతనిపై కూడా నిషేదాన్ని విధించినట్లుగా అమెరికా చెబుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/