ఓవైపు ఉత్తర కొరియా మిస్సైల్స్ పరీక్షలతో భయపెడుతుంటే.. మరోవైపు అమెరికా ముందు జాగ్రత్తగా తమ క్షిపణి రక్షణ వ్యవస్థను పరీక్షించుకునే పనిలో ఉంది. తాజాగా హవాయి తీరంలో యూఎస్ మిస్సైల్ డిఫెన్స్ ఏజెన్సీ (ఎండీఏ) - నేవీ సంయుక్తంగా మిస్సైల్ డిఫెన్స్ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు ఎండీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. జపాన్ మీదుగా ఉత్తర కొరియా క్షిపణిని ప్రయోగించిన తర్వాతి రోజే అమెరికా తమ క్షిపణి రక్షణ వ్యవస్థను పరీక్షించడం గమనార్హం. అయితే ఎంతో ముందుగానే షెడ్యూల్ చేసిన టెస్ట్ అని ఎండీఏ తెలిపింది.
స్టాండర్డ్ మిస్సైల్-6 గైడెడ్ మిస్సైల్స్ ను ఈ పరీక్ష కోసం ఉపయోగించారు. ఇది విజయవంతంగా ఓ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ను ఛేదించింది. రెండు నెలల కిందట ఇదే పరీక్షను నిర్వహించినా అప్పుడు విఫలమైంది. ఇప్పుడదే యూఎస్ ఎస్ జాన్ పాల్ జోన్స్ యుద్ధ నౌక నుంచే పరీక్షించగా విజయవంతమైంది. ఈ నౌకాదళ విభాగ క్షిపణి రక్షణ వ్యవస్థ బాలిస్టిక్ మిస్సైల్స్ ను అడ్డుకునే తమ సామర్థ్యాన్ని మరింత పెంచిందని ఎండీఏ స్పష్టంచేసింది. ఇది ఒకరకంగా ఉత్తర కొరియాకు పెంటగాన్ ఇచ్చిన వార్నింగ్. మంగళవారం బాలిస్టిక్ మిస్సైల్ ను జపాన్ మీదుగా ప్రయోగించిన తర్వాత.. ఇది కేవలం కర్టెన్ రైజరే అని నార్త్ కొరియా హెచ్చరించిన విషయం తెలిసిందే. తమ తర్వాతి లక్ష్యం అమెరికా భూభాగమైన గువామేననీ స్పష్టంచేసింది. దీంతో అమెరికా ముందుగానే అందుకు సిద్ధమవుతోంది.