అంచనాలు నిజమయ్యాయి. అనుకున్నదే జరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అనుకున్న దానికి తగ్గట్లే.. తాజాగా వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ కానీ విజయం సాధిస్తే.. కీలక వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంటారని.. దీంతో.. వర్థమాన దేశాలకు నష్టం వాటిల్లుతుందన్న భయాందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తగ్గట్లే.. తాజాగా వడ్డీరేట్లను 0.25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గడిచిన పదేళ్ల కాలంలో వడ్డీరేట్లను పెంచటం ఇది రెండోసారి మాత్రమే కావటం గమనార్హం.
అమెరికా అర్థిక వ్యవస్థ బలంగా ఉండటంతో అమెరికా కేంద్ర బ్యాంకు బోర్డు వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్న 0.50 శాతం నుంచి తాజాగా 0.75 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను కానీ అధికారంలోకి వస్తే.. పన్నుల్ని తగ్గిస్తానని.. ఖర్చుల్ని అదుపులోకి తీసుకొస్తానని ట్రంప్ చెప్పారు. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారు జామున ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
వడ్డీ రేట్లను పెంచటం అంత ప్రాముఖ్యత ఎందుకంటే.. దానికి చాలానే అంశాలు ఉన్నాయని చెప్పాలి. సంపన్న దేశమైన అమెరికాలో వడ్డీరేట్లు తక్కువగా ఉంటాయి. దీంతో.. అక్కడి మదుపుదార్లు పలు వర్థమాన దేశాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అమెరికాలో వడ్డీ రేట్లు పెంచటం జరిగితే.. ఇక్కడికి తరలి వచ్చిన పెట్టుబడులు అమెరికాకు తరలి వెళ్లే ప్రమాదం ఉంది. అదే జరిగితే.. షేర్ మార్కెట్లు తీవ్ర ప్రభావానికి గురి అవుతాయి. అయితే.. తాజా పరిణామం ఊహించే కావటం.. దీనికి తగ్గట్లే మార్కెట్లు ఇప్పటికే ప్రతికూల ప్రభావాన్ని చూపించటం జరిగిపోయాయి. అనుకున్నదే జరిగిన నేపథ్యంలో.. అధికారికంగా తీసుకున్న తాజా నిర్ణయంతో స్టాక్ మార్కెట్ల మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. వడ్డీ రేట్ల పెంపుతో డాలర్ మరింత బలపడే అవకాశం ఉంటుంది. అదే జరిగితే.. రూపాయికి ఇదో దెబ్బగా మారుతుందనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/