వాళ్లకు అమెరికా గ్రీన్ కార్డులు..భారతీయులకే ప్రయోజనం!

Update: 2020-05-10 04:23 GMT
కరోనాతో అతలాకుతలం అవుతున్న అగ్రరాజ్యం అమెరికా తీసుకున్న నిర్ణయం భారతీయులకు వరంగా మారింది. ఇప్పటికే గ్రీన్ కార్డుల జారీని 60రోజుల పాటు నిలిపివేసిన అమెరికా జూన్ నాటికి హెచ్1బీ వీసాల గడువును పొడిగించరాదని డిసైడ్ అయ్యింది.  దీంతో అమెరికా వెళ్లడం దుర్లభం కానుంది. ఇక అమెరికాలో ఉన్న విదేశీయులు కూడా ట్రంప్ సర్కార్ నిర్ణయంతో స్వదేశాలకు తరలాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే అగ్రరాజ్యం అమెరికాను కరోనా కల్లోలం చేస్తోంది. 13 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 80 వేల మంది ప్రాణాలు ఇప్పటికే కరోనా తీసింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉన్న నర్సులు, వైద్యులకు కూడా కరోనా సోకి వారంతా సేవలు అందించలేకపోతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన అమెరికా కాంగ్రెస్ గ్రీన్ కార్డుల బిల్లును ప్రవేశపెట్టింది. అమెరికాలో స్థిరపడడానికి ఈ బిల్లు ద్వారా  అవకాశం కల్పించింది.

అయితే ఈ గ్రీన్ కార్డులు అందరికీ అమెరికా ఇవ్వడం లేదు. కేవలం విదేశీ డాక్టర్లు - నర్సులకు మాత్రమే ఈ కార్డులను ఇవ్వాలని నిర్ణయించింది.  ఎవరికీ కేటాయించని దాదాపు 40వేల గ్రీన్ కార్డులను తక్షణం జారీ చేయాలని అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లో బిల్లును ప్రవేశపెట్టింది. ఈ గ్రీన్ కార్డులను మంజూరు చేయడం ద్వారా అమెరికన్ పౌరులకు వైద్యసహాయం అందించడంతోపాటు విదేశీయులు అక్కడ శాశ్వత నివాసం ఉండవచ్చు.

ఈ బిల్లు ద్వారా అత్యధికంగా భారతీయులకే ప్రయోజనం కలుగనుంది.  ఈ బిల్లు ఆమోదిస్తే 25000 మంది నర్సులు, 15000 మంది విదేశీ డాక్టర్లకు గ్రీన్ కార్డులు లభిస్తాయి. అక్కడే ఉంటున్న హెచ్1బీ, జే2 వీసాలపై ఉండి గడువు ముగుస్తున్న భారతీయ డాక్టర్లు, నర్సులకు ఇది ఎంతో ప్రయోజనంగా మారింది. 

   

Tags:    

Similar News