ట్రంప్ రూల్..వారందరికీ అక్టోబ‌ర్ 1 డెడ్ లైన్!

Update: 2018-09-27 10:51 GMT
డొనాల్డ్ ట్రంప్ ....ఈ పేరు చెప్ప‌గానే భార‌తీయుల‌తో పాటు ప‌లు దేశాల ప్ర‌జ‌ల్లో క‌ల‌వ‌రం మొద‌ల‌వుతుంది. ముఖ్యంగా గ‌త నాలుగేళ్లుగా అమెరికాలో ఉంటోన్న భార‌తీయుల‌కు ట్రంప్...కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. అమెరిక‌న్ల‌లో లోక‌ల్ సెంటిమెంట్ ను రెచ్చ‌గొట్టి.....కొత్త నిబంధ‌న‌ల‌తో విదేశీయుల‌పై ఆంక్ష‌లు విధిస్తున్నాడు. హెచ్ -1బీ వీసాల్లో క‌ఠిన నిబంధ‌న‌లు విధించ‌డం, యూఎస్ సిటీజన్‌ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌ సీఐఎస్) అధికారులకు మ‌రిన్ని అధికారాలు....మ‌రో మూడు నెల‌ల్లో హెచ్-4 వీసాల ర‌ద్దు....గ్రీన్ కార్డు కావాలంటే ష‌ర‌తులు....వంటి చర్య‌ల‌తో ట్రంప్...కంపు కంపు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ట్రంప్ మ‌రో బాంబు పేల్చారు. అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌ను అక్టోబ‌రు 1 నుంచి దేశం నుంచి పంపాల‌ని ట్రంప్ స‌ర్కార్ యోచిస్తోంది. వీసా పొడగింపు - స్టేటస్‌ మార్పు కోసం దరఖాస్తు చేసుకుని తిరస్కరణకు గురైన వలసదారులను దేశం నుంచి పంపించే ప్రక్రియను అక్టోబర్ 1 నుంచి మొదలుపెట్టనుంది.

ఈ ప్ర‌కారం దరఖాస్తు తిరస్క‌ర‌ణ‌కు గురైన‌ దరఖాస్తుదారులకు ..నోటీసులు పంపించనున్నామ‌ని యూఎస్ సిటీజన్‌ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌ సీఐఎస్) అధికారులు ప్రకటించారు. కానీ, హెచ్-1బీ వీసాదారులకు అధికారులు ఊర‌ట‌నిచ్చారు. ఉద్యోగ‌రీత్యా - మానవత్వ కోణాల్లో అందిన దరఖాస్తుదారులకు నోటీసులు పంపించబోమని తెలిపారు. వీసా పొడగింపు లేదా స్టేటస్‌ ను మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకుని చట్టపరంగా నివసించడానికి అనుమతిలేని(ఎన్‌ టీఏ) వారికి మాత్రమే నోఠీసులు పంపించనున్నామని వారు తెలిపారు. నేర చరిత్ర - మోసాలు - జాతీయ భద్రతకు హాని కలిగించే వ్యక్తులకు ముందుగా నోటీసులు ఇవ్వనున్నారు. వీసా వివరాలు - తిరస్కరణ - దేశం నుంచి ఎప్పుడు వెళ్లిపోవాలనే అంశాలను నోటీసుల్లో ప్రస్తావించనున్నారు. ఇటీవల తిర‌స్క‌ర‌ణ‌కు గురైన హెచ్-1బీ వీసా పొడగింపు దరఖాస్తులలో భారతీయుల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. దీంతో, ఈ స‌రికొత్త నిర్ణ‌యంతో చాలామంది భారతీయులు ఇబ్బందిప‌డే అవ‌కాశ‌ముంది.
Tags:    

Similar News