కరోనా లక్షణాలు ఉన్న వారెంత ప్రమాదకరమన్న విషయాన్ని దేశంలో మరెవరూ వర్ణించలేనంత బాగా.. ఒక్క మాటలో తేల్చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. వారు ఆటమ్ బాంబులు లాంటివారని.. వారి పుణ్యమా అని వేలల్లో కరోనా బారిన పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే.. కఠిన నిర్ణయాలు తప్పనిసరి అంటూ కరోనా బాధితులతో సమాజానికి పొంచి ఉండే ప్రమాదం ఏపాటిదో అందరికి అర్థమయ్యేలా చెప్పేశారు కేసీఆర్. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన వారి కారణంగా కరోనా వ్యాప్తి చెందటాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు సమర్థంగా నిలువరించటం తెలిసిందే.
నిజానికి.. ఈ విషయం పది రోజుల క్రితమే ఒక కొలిక్కి వచ్చినా.. అనుకోని రీతిలో తెర మీదకు వచ్చిన తబ్లిగీ జమాత్ నిర్వహించిన హజ్రత్ సదస్సు.. దేశానికి ఒక సమస్యగా మారింది. ఈ సదస్సులో పాల్గొన్న వారికి కరోనా సోకటం.. వారి కారణంగా పెద్ద ఎత్తున కేసులు నమోదు కావటం తెలిసిందే. ఈ కలకలాన్ని ఒక కొలిక్కి తెచ్చే విషయంలో కొన్ని రాష్ట్రాలు యాక్టివ్ గా పని చేశాయి. వాటిల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి. యుద్ధ ప్రాతిపదికన తబ్లిగీ జమాత్ సభ్యుల్ని గుర్తించటమే కాదు.. వారి ద్వారా కాంటాక్టు అయిన వారిని గుర్తించే భారీ ఆపరేషన్ ను ఎలాంటి రచ్చ లేకుండా నిర్వహించారు.
అందులో పాజిటివ్ కేసుల్ని గుర్తించి వారికి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉంటే దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో పరిస్థితి మరోలా ఉంది. మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిని గుర్తించే విషయంలో యోగి సర్కారు కిందామీదా పడుతోంది. ఆ సదస్సుకు వెళ్లి వచ్చిన వారంతా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లటం.. వారి ఆచూకీ తేలకపోవటం ఆందోళనకు గురి చేస్తోంది. లేనిపోని భయాలు.. అవగాహన లేమి లాంటి కారణాలతో మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారు బయటకు రావటం లేదు. దీంతో కరోనా అనుమానితుల లెక్క ఎంతన్నది తేలట్లేదు. వారిలో పాజిటివ్ ఎంతమందన్నది క్వశ్చన్. ఒకవేళ.. ఎక్కువమంది అలాంటివారు ఉంటే.. కేసీఆర్ చెప్పినట్లు వారంతా సమాజానికి ఆటమ్ బాంబులే అవుతారు.
మరి.. అలాంటివారిని వెతికి పట్టుకునేందుకు యోగి సర్కారు వినూత్న ప్రకటన చేసింది. దీని ప్రకారం.. మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి ఆచూకీ చెప్పిన పక్షంలో రూ.5వేల నజరానా ఇస్తామని ప్రకటించింది. అనుమానితుల్లో కరోనా పాజిటివ్ ఉన్న వారుంటే వారంతా ఆటమ్ బాంబులే. అలాంటి వారి సమాచారం ఇచ్చినందుకు రూ.5వేలేనా? అన్న పెదవి విరుపు వినిపిస్తోంది. తాయిలం భారీగా ఉంటే.. విషయాలు ఇట్టే బయటకు వస్తాయంటున్నారు. మరీ విషయంలో యోగి మైండ్ సెట్ ఎప్పటికి మారుతుందో?